పెళ్ళి కారులో వచ్చి మాజీ మంత్రి చుట్టాల్ని రేడ్ చేసిన ఐటి ఆధికారులు

నార్మల్ గా ఒక పెద్ద ఇంటి మీద ఇంకమ్ ట్యాక్స్ అధికారులు రేడ్ చేస్తున్నారంటే చాలాసార్లు ముందే అడ్డదారిలో సమాచారం వెళ్ళిపోతుంది.దాంతో ఆ పెద్దమనుషులు జాగ్రత్తపడతారు.

 It Officers Arrived In Wedding Cars To Raid P.chidambaram’s Relatives-TeluguStop.com

ఉన్న బ్లాక్, వైట్ తేడా లేకుండా డబ్బునంతా దాచేస్తారు.ట్యాక్స్ లెక్కలకి, తమ సంపాదనకి సంబంధం లేకుండా ఉంటే కష్టాల్ని చూడాలి కదా.అందుకే దాచేస్తారు.ఒక్కోసారి ఇంఫర్మేషన్ లీక్ అవకపోయినా, అధికారుల రాక గమనించి కూడా సర్దేసుకుంటారు.

అందుకే ఓ కొత్త ప్లాన్ వేసారు ఐటి అధికారులు.ఎవరు ఊహించలేనిది.

మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తెలుసుగా? ఆయన చుట్టాలు విశ్వనాథన్, సతాప్పన్ మీద ఐటి రేడ్స్ జరిగాయి.అది ఎలాగో సంచలనమైన వార్తే కాని అంతకుమించిన వార్త ఏమింటంటే, ఈ రేడ్ కోసం అధికారులు వేసిన ప్లాన్.

మొన్న ఉదయం 8 గంటల సమయంలో కర్ణాటకలోని కొడాగు ఏరియాలోని SLN గ్రూప్ యజమానల ఇంటిముందికి కొన్ని పెళ్ళి కార్లు వచ్చి ఆగాయి.దారిపొడవునా అంత ఇవి పెళ్లి కార్లే అనుకున్నారు.

ఇంటిముందు ఈ కార్లు సడెన్ గా చూసి ఎవరో చుట్టాలు వచ్చారేమో అని అనుకున్నారు.కాని కారులోంచి దిగినవారు సంప్రదాయ వస్త్రాల్లో లేరు, సూటుబూటు వేసుకోని ఉన్నారు.కట్ చేస్తే వారు ఐటి అధికారులు.12 జట్లుగా వచ్చారు.నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా రేడ్ మొదలుపెట్టారు.

ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసారంటే ఆ ప్రాంత పోలీసులకి ఎలాంటి సమాచారం అందించలేదు.బదులుగా మైసూరు పోలీసులని తమ వెంట తెచ్చుకున్నారు.ఈ ఇద్దరికీ చెందిన కాఫీ ప్రాసెసింగ్ యూనిట్, పెట్రోల్ బంకులు, టింబర్ డిపో, రిసార్ట్‌ .అన్ని డ్యాకుమెంట్లు సీజ్ చేసారు.మొత్తం లెక్కలు లాగుతున్నారు.

అసలే పి.చిదంబరం పేరు ఏకంగా లక్షల కోట్ల స్కామ్ లో ఉంది.అయినా తగిన చర్యలు లేవు.మరి అంతటి పెద్దమనిషి చుట్టాల్ని రేడ్ చేయాలంటే మామూలు విషయం కాదు కదా.అందుకే ఎలాంటి క్లూ వదలకుండా ఈ ప్లాన్ వేసారు ఐటి అధికారులు.ఎలా ఉంది ప్లాన్ .ఏదో శంకర్ సినిమాలో సీన్ లా లేదు?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube