నెక్స్ట్ టార్గెట్ సీం..? ఏపీలో ఏమ్ జరగబోతోంది..?   IT Next Target Is CM Chandrababu Naidu     2018-10-13   07:55:28  IST  Surya

ఏపీ లో నేతలకి హై బీపీ తెప్పిస్తున్న ఏకైక మాట ఐటీ దాడులు..ఒక్కో నేతకి వెన్నులో వణుకు పుడుతోంది..పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఎంతో వ్యూహాత్మకంగా ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయి అనేది సత్యం. ఆదాయపు పన్ను శాఖ వారికి , వీక్షించే ప్రజలకి , దాడులు చూపించే మీడియాకి ఇవన్ని కొత్త కాదు కానీ తెలుగుదేశం పార్టీ కి చంద్రబాబు కోటరీకి ఇది మాత్రం పెద్ద షాక్ అని చెప్పాలి..వచ్చే ఎన్నికల్లో ఆర్ధిక భారం కలుగ చేసి చంద్రబాబు చుట్టూ ఉన్న ఆర్ధిక మద్దతు దారులని చిన్నాభిన్నం చేయడమే కేంద్రం వ్యూహంగా అందరికి అర్థమవుతోంది..

ఇది జస్ట్ సాంపిల్ మాత్రమే అసలు కధ ముందుంది అనేట్టుగా సాగుతున్నాయి ఐటీ దాడులు..ఈ దాడుల అంతిమ లక్ష్యం మాత్రం చిన్న పిల్లాడిని అడిగినా చటుక్కున చెప్తాడు సీఎం చంద్రబాబు ని టార్గెట్ చేశారని..ఈ దాడులు రాజకీయ వ్యూహంలో భాగంగానే వరుస సోదాలు జరుగుతున్నాయనే అనుమానాలు రోజు రోజుకి బలపడుతున్నాయి. .ముందుగా టీడీపీ నేత బీద మస్తాన్‌రావుపై ఐటీ గురి పెట్టింది…ఆ తర్వాత ఒకేసారి 19 బృందాలు విరుచుకుపడ్డాయి. ఆపై… రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరిగాయి. ఈ క్రమంలోనే సీఎం రమేశ్‌ కి కూడా ఐటీ చుక్కలు చూపించింది.

ఇదిలాఉంటే ఈ దాడులని మరింతగా చేయనున్నారని తెలుస్తోంది..అందులో భాగంగానే రెండు ప్రముఖ కాంట్రాక్టు కంపెనీలపైనా దాడులు జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది ఇందులో ఒకటి టీడీపీ నేతకు చెందిన సంస్థ

అయితే సోడాలలో ఎటువంటి విషయాలు పరిశీలిస్తున్నారు… ఏమి స్వాధీనం చేసుకుంటున్నారు.. అనే విషయాలపై అధికారులు గోప్యత పాటిస్తున్నారు. వీటిపై ఎలాంటి అధికార ప్రకటనలు విడుదల చేయడంలేదు. గత ఎన్నికల్లో టీడీపీకి ఆర్థికంగా అండగా ఉన్న వారు…ఈ ఎన్నికల్లో సహకారం అందించే అవకాశమున్న వారితో ‘హిట్‌ లిస్ట్‌’ తయారైనట్లు సమాచారం. ఆయా కంపెనీలకు చెందిన సమస్త సమాచారాన్ని ఐటీ శాఖ ముందుగానే తెప్పించుకున్నట్లు తెలిసింది.

IT Next Target Is CM Chandrababu Naidu-

ఇక్కడ అసలు విషయం ఏమిటంటే…ఈ దాడుల వెనుక వ్యూహరచన కర్ణాటక ఎన్నికల నాటినుంచే జరుగుతూ వచ్చిందని అప్పటి నుంచీ ఎప్పటికప్పుడు వీరు టార్గెట్ చేసుకున్న కంపెనీల లావాదేవీలపై పక్కా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నారని అయితే ఈ వ్యవహారం సొంత బీజేపీ పార్టీలో నేతలకి కూడా తెలియనివ్వలేదని టాక్ వినిపిస్తోంది…ఇప్పటి వరకూ టీడీపీ నేతలకి సంభందించిన ముఖ్యంగా చంద్రబాబు కి ఆర్ధిక అండదండలు అందించే నేతలపైనే ఐటీ దాడులు జరగడంతో ఇక ఐటీ చివరి టార్గెట్ చంద్రబాబే అంటూ పలు మీడియాలో సైతం వార్తలు రావడతో ఏపీలో ఏమి జరుగబోతోందో అంటూ ఉత్ఖంట రేపుతోంది.