పాపం పబ్ జి ప్రియులు.నిజంగా ఇది వాళ్ళకి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
ఎందుకంటే పబ్ జి ఎంతోమంది యువతీ యువకులు అడిక్ట్ అయిపోయారు.ఏ పని చెయ్యకుండా 24 గంటలు పబ్ జి ఆడమన్న ఆడే ఓపిక శక్తి ఉంటుంది వారికీ.
ఇంకా ఈ నేపథ్యంలోనే అలాంటి పబ్ జి ప్రియులకు కేంద్రం గట్టి షాక్ ఇవ్వబోతుంది.
ఎందుకు అని అనుకుంటున్నారా? అదేనండి త్వరలోనే పబ్ జి బ్యాన్ చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.అయితే కేవలం పబ్ జి నే కాదు దాంతో పాటు చైనాతో సంబంధం ఉన్న 275 యాప్లను నిషేధించడంపై కేంద్రం దృష్టి పెట్టింది.ఆ యాప్స్ కి సంబంధించిన లిస్ట్ కూడా తయారు చేసినట్టు సమాచారం.
త్వరలోనే ఈ యాప్ల బ్యాన్లకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.కాగా చైనా భారత్ ఉద్రిక్థత కారణంగా ఇప్పటికే చైనాకు సంబంధించిన 59 యాప్స్ లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే.
మన భారత్ లనే దేశ భద్రత, రక్షణ దృష్ట్యా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఆ యాప్స్ ని బ్యాన్ చెయ్యాలనుకున్న సంగతి విదితమే.మరి పబ్ జి ఎప్పుడు బ్యాన్ అవుతుంది అనేది చూడాలి.