కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ జీవితం అంతం అయిందా ?

కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు.ఉమ్మడి రాష్ట్రం చివరి ముఖ్యమంత్రి అనే సంగతి అందరికీ తెలిసిందే.

 Ktr Takes A Dig At Kiran Kumar Reddy-TeluguStop.com

రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు కిరణ్ అజ్ఞాతంలో ఉన్నారు.ఆయన మీడియాకు దొరకడంలేదా ? మీడియా ఆయనను పట్టించుకోవడం లేదా ? తెలియదు.ఆయన్ని గురించి ఎవ్వరూ మాట్లాడుకోవడంలేదు.కొంతకాలం కిందట కాషాయ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది.కానీ అది నిజం కాలేదు.ఇటీవలి కాలంలో కాంగ్రెసులోకి తిరిగి వెళతారని పుకార్లు వచ్చాయి.

కానీ ఆ కథ ముందుకు పోలేదు.సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న నాయకుడు, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తీ పూర్తిగా నోరు కట్టేసుకొని అజ్ఞాతంలో ఉండటం ఆశ్చర్యకరం.

ఇలా ఉండటం రాజకీయ నాయకుల స్వభావానికి విరుద్ధం.అందులోనూ వయసులో కూడా కిరణ్ చిన్నవాడు.

ఇంట తక్కువ వయసులో రాజకీయాల నుంచి ఎవ్వరూ రిటైర్ కారు.అయితే తెలంగాణా పంచాయతీరాజ్ అండ్ ఐటీ శాఖల మంత్రి తారక రామా రావు మాత్రం కిరణ్ రాజకీయ జీవితం అంతం అయిందని చెప్పారు.

ఆయనకు భవిష్యత్తు లేదన్నారు.ఇది కోపంతో అన్న మాట తప్ప వాస్తవం కాదు.

రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణకు కరెంటు కస్టాలు వస్తాయని కిరణ్ చెప్పారు.కానీ కిరణ్ చెప్పింది అబద్ధమని కెసీఆర్ నిరూపించారని మంత్రి అన్నారు.

రాష్ట్ర విభజనకు కిరణ్ అడ్డుపడ్డారు కదా.ఆ కోపం ఇంకా చల్లారలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube