వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి( YCP MP Mithun Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.వైఎస్ షర్మిల( YS Sharmila ) దుష్ట శక్తుల ట్రాప్ లో పడ్డారని పేర్కొన్నారు.
షర్మిలను చూస్తే జాలేస్తుందని తెలిపారు.అయితే తమ సీఎం జగన్ చెల్లెలిగా షర్మిలను గౌరవిస్తామని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు.
కానీ షర్మిల చంద్రబాబు( Chandrababu ) స్క్రిప్ట్ ను చదవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.జగన్ ను( Jagan ) 16 నెలల పాటు జైలులో పెట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన కాంగ్రెస్ కోసం ఇప్పుడు షర్మిల పని చేయడం బాధాకరమని తెలిపారు.