వైరల్ వీడియో: చూడడానికి ఉల్లిపాయలాగానే ఉంది కానీ కట్ చేస్తే దాని అసలు రంగు బయటపడింది..!

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే ఒక సామెత గురించి మీరు వినే ఉంటారు.కానీ ఉల్లిపాయను కోయాలంటే మాత్రం ఎవరయినా సరే కన్నీళ్లు పెట్టాలిసిందే.

 It Looks Like An Onion But When Cut It Loses Its Original Color Viral News, Soci-TeluguStop.com

ఎందుకంటే ఉల్లిపాయ ఘాటుగా ఉండడం వలన ఉల్లిని కోసిన ప్రతిసారి మన కంట్లో నుంచి నీళ్లు ధారాళంగా కారడంతో పాటు, కళ్లు కూడా మంటలు పుడతాయి.అలాగే ఉల్లిపాయ లేనిదే ఏ కూర కూడా వండలేము.

అందుకే మన వంటకాల్లో ఉల్లిపాయకు ఉన్న ప్రాముఖ్యత మరే ఇతర వాటికి ఉండవు.అయితే మీకు ఉల్లిపాయకు సంబందించిన ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి చూపించాలి.

వీడియోలో కనిపించే ఉల్లిపాయను మీరు కట్ చేస్తే అసలు మీ కంట్లో నుంచి ఒక్క చుక్క కూడా నీరు బయటకు కారదు.అసలు మంట కూడా పుట్టదు అంటే నమ్మండి.

అదెలా సాధ్యం అని అనుకుంటున్నారా.? అయితే మీరు అసలు మ్యాటర్ తెలుసుకోవాలిసిందే.ప్రస్తుతం ఈ ఉల్లిపాయకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.చూడడానికి అచ్చం ఉల్లిపాయ మాది
రిగానే కనిపిస్తుంది గాని అది నిజానికి ఉల్లిపాయ కాదు.

దాన్ని కట్ చేస్తే గాని అది ఉల్లిపాయ కాదు అనే నిజం అందరికి తెలుస్తోంది.

ఎందుకంటే అది ఉల్లిపాయ రూపంలో ఉన్న కేక్ అని.అచ్చం ఉల్లిపాయ మాదిరిగానే ఈ కేక్ ను తయారు చేశారు.ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉల్లిపాయ తొడుగు ఎలా అయితే ఉంటుందో సరిగ్గా అలాంటి తొడుగునే కేక్ క్రీమ్ తో తయారు చేసి కేక్ ల చేసారు.

ఈ క్రెయేటివిటీకి ఏ పేరు పెట్టిన తక్కువే అని చెప్పాలి.ఇది చూసిన నెటిజన్స్ నివ్వెరపోతున్నారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు కేక్ తమదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.అసలు ఉల్లిపాయ మాదిరిగా కనిపిస్తున్న ఈ కేక్ ఎలా తయారు చేశారు.? ఉల్లిపాయ మీద ఉన్న తొక్కా రియల్ దేనా.? దానిని ఎలా తయారు చేసారు ఏంటి అని కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube