మ‌ధుమేహం రోగులు ఈ పండ్లు తింటే చాలా డేంజ‌ర్‌.. తెలుసా?

మ‌ధుమేహం లేదా షుగ‌ర్ వ్యాధి.నేటి కాలంలో చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య ఇది.మ‌ధుమేహం వ్యాధి ఒక్క సారి వ‌చ్చిందంటే జీవిత‌కాలం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.మ‌ధుమేహం వ్యాధి నివార‌ణ‌కు ఎలాంటి చికిత్స లేదు.

 It Is Very Dangerous For Diabetics To Eat These Fruits-TeluguStop.com

కేవ‌లం చ‌క్కెర స్థాయిల‌ను అదుపు చేసే మందులు మాత్ర‌మే అంద‌బాటులో ఉన్నాయి.అందుకే మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు ప్ర‌తి విష‌యంలోనూ చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.

అయితే మధుమేహం ఉన్నవారు పండ్లు తినకూడదని చాలామంది భావిస్తారు.

 It Is Very Dangerous For Diabetics To Eat These Fruits-మ‌ధుమేహం రోగులు ఈ పండ్లు తింటే చాలా డేంజ‌ర్‌.. తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది నిజ‌మే.

కానీ, అన్ని పండ్ల‌కు దూరంగా ఉండాల్సిన అవ‌స‌రం లేదు.కేవ‌లం కొన్ని కొన్ని పండ్లకు దూరంగా ఉంటే చాలంటున్నారు.

మ‌రి ఆ పండ్లు ఏంటీ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.సీతాఫలం.

ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.కానీ, మ‌ధుమేహం రోగులు మాత్రం సీతాఫ‌లం తిన‌క‌పోవ‌డ‌మే మంచిది.

ఎందుకంటే, సీతాఫ‌లంలో చ‌క్కెర మ‌రియు కార్బోహైడ్రేట్లు అత్య‌ధికంగా ఉంటాయి.కాబ‌ట్టి, సీతాఫ‌లం తీసుకుంటే బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగిపోతాయి.

Telugu Diabetes, Diabetes Patient, Diabetics, Eat Fruits, Fruits, Good Health, Health, Health Tips, Latest News-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

అలాగే మ‌ధుమేహం రోగులు దూరంగా ఉండాల్సిన పండ్ల‌లో ద్రాక్ష పండ్లు కూడా ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.ద్రాక్షలో కూడా చక్కెర పరిమాణం ఎక్కువ‌గా ఉంటాయి.అర‌టి పండ్లు అందులో బాగా పండిన అర‌టి పండ్ల‌కు మ‌ధుమేహం రోగులు తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది.అర‌టి పండులో ఉండే చక్కెర స్థాయిలు.బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను పెంచేస్తాయి.

ఎన్నో పోష‌కాలు నిండి ఉండే పుచ్చకాయను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

కానీ, మ‌ధుమేహం రోగులు మాత్రం ప‌చ్చ‌కాయ తిన‌క‌పోవ‌డ‌మే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.‌ ఇక వీటితో పాటుగా.

పైనాపిల్, స‌పోటా, ఆప్రికాట్ వంటి పండ్లు కూడా మ‌ధుమేహం రోగుల‌కు ఏ మాత్రం మంచిది కాదు.అయితే మ‌ధుమేహం రోగులు దానిమ్మ, బొప్పాయి, బెర్రీస్‌, చెర్రీస్‌, నేరేడు, జామకాయ, యాపిల్ వంటివి మితంగా తీసుకుంటే.

ఆరోగ్యానికి ఎంతో మేలు జ‌రుగుతుంది.

#Fruits #Health Tips #Eat Fruits #Diabetes #Diabetics

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు