షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది ఉన్నారు.పూర్వం అరవై, డబ్బై ఏళ్లలో వచ్చే ఈ షుగర్ వ్యాధి నేటి కాలంలో పాతిక, ముప్పై ఏళ్ల దాపరిస్తూ ప్రాణం తోడేస్తుంది.
ఒక్క సారి ఈ షుగర్ వ్యాధి వచ్చిందంటే జీవితాంతం మనతోనే ఉంటుంది.ఇక షుగర్ వ్యాధి ఉన్న వారు ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
అందులోనూ ముఖ్యంగా ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించాలి.కొన్ని కొన్ని ఆహారాలును షుగర్ వ్యాది గ్రస్తులు అస్సలు తినకూడదు.
వాటిని అతి ముఖ్యమైన ఆహారాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అరటి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అనేక జబ్బుకు చెక్ పెడుతుంది.కానీ, షుగర్ వ్యాధి ఉన్న వారు మాత్రం అరటి పండుకు దూరంగా ఉండాల్సిందే.
ఎందుకంటే అరటి పండులో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.కాబట్టి, దీనిని తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి.
ఒకవేళ అంతగా అరటి పండు తినాలనుకుంటే సగం తినండి.సీతాఫలం, మామిడిపండ్లు, పుచ్చకాయ, ద్రాక్షపండ్లు, సపోటా వీటిలో కూడా చక్కెర అధికంగా ఉంటుంది.
అందువల్ల, ఈ పండ్లతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాటి.

అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు ఎప్పుడూ కూడా నిల్వచేసిన ఊరగాయలు తినరాదు.ఎందుకంటే, వీటిలో అధికంగా ఉండే సోడియం మధుమేహం వ్యాధిగ్రస్తుల్లో అధిక రక్తపోటు ఏర్పడేలా చేస్తుంది.ఇక డ్రై ఫ్రూట్స్ అంటే కిస్‌మిస్, ఎండు ఖర్జూరం, అత్తి పండ్లు ఇలాంటివి కూడా షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచివి కాదు.
ఎందుకంటే, వాటికి సాంద్రీకృత సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి.కాబట్టి, వీటిని తీసుకున్నా చాలా తక్కువ మోతాదులోనే తీసుకోవాలి.
అదే విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్, ప్యాక్ చేయబడిన స్నాక్స్ వంటివి కూడా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఏ మాత్రం మంచిది కావు.అలాగే వైట్ రైస్, మొక్కజొన్న, బంగాళాదుంపలు, అధికంగా ప్రాసెస్ చేసిన తెల్ల పిండి, పండ్ల రసాలు, మటన్, కొవ్వు అధికంగా ఉంటే పాల ఉత్పత్తులు వంటి వాటికి కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.