కొంప ముంచుతున్న ఆ మీడియా ? మేలుకో బాబు ?

ఎవరికి లేనంత ప్లస్ పాయింట్ తెలుగుదేశం పార్టీకి ఉంది.మెజార్టీ వీడియో సంస్థలు బాబు వర్గానికి చెందినవి కావడంతో, సహజంగానే వారంతా టీడీపీకి మద్దతు ఇస్తూ, ఆ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే విధంగా తమదైన శైలిలో కథనాలు ప్రచారం చేస్తూ వస్తున్నారు.

 It Is Through The Pro Tdp Media That The Party Is In Trouble , Tdp,  Tdp Support-TeluguStop.com

పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా,  టిడిపి ని హైలెట్ చేయడమే పనిగా కొన్ని మీడియా సంస్థలు బాధ్యతను భుజాన వేసుకున్నాయి.ఎప్పుడూ టిడిపి కి అనుకూలంగా వార్తలు ప్రచారం చేయడమే ఆ మీడియా పనిగా పెట్టుకుంటూ వస్తోంది.

అయితే దీని కారణంగా టిడిపికి జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది.  టిడిపి అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీలో , ప్రభుత్వంలో నెలకొన్న సమస్యలపై వస్తున్న విమర్శలపైనా ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చి అంత బాగుంది అన్నట్లుగా టిడిపి అనుకూల మీడియా ప్రచారం చేసింది.

ఒక దశలో బిజెపి టిడిపి మధ్య పొత్తు రద్దు అవడానికి ఓ మీడియా ఛానల్ అధినేత కారణమనే ప్రచారం జరిగింది.  బిజెపి-టిడిపి పొత్తు ఖరారు కావడంతో 2019 ఎన్నికల్లో టిడిపి ఓటమిపాలు కావడానికి ఒక కారణం అయ్యింది.

అలాగే  ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను కానీ , ఎమ్మెల్యేలు ,మంత్రుల పనితీరు పై, వారి అవినీతి వ్యవహారాలను సదరు టీడీపీ అనుకూల మీడియా కప్పిపుచ్చడం, వాస్తవ పరిస్థితులు ఏమిటనేది చంద్రబాబు కు తెలియకుండా , అంతా బాగుంది అన్నట్లుగా ప్రభుత్వం ప్రచారం చేయడం, వంటి ఎన్నో అంశాలు టిడిపి ఓటమికి కారణాలు అయ్యాయి.అలాగే జనాల్లో జగన్ బలం పెంచుకుంటున్నా, దానిని తక్కువ చేసి చూపించి టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లుగా కథనాలు ప్రచారం చేయడం ఇలా ఎన్నో అంశాలు ఆ తరువాత టిడిపికి ఇబ్బందులు తెచ్చిపెట్టాయి.

ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం జనాల్లో మరింత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటోంది.

అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలలో చెరగని ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తోంది.

Telugu Ap, Chandra Babu, Chandrababu, Jagan, Jagan Schemes, Jahan, Tdp, Pro Tdp,

అయితే ఇప్పుడు అదంతా కప్పిపుచ్చి జగన్ పాలన పై తీవ్ర వ్యతిరేకత ఉందని, మళ్ళీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ విజయం ఖాయం అన్నట్లుగా టీడీపీ అనుకూల మీడియా లో ప్రచారం సాగుతోంది.ఈ తరహా భజన వల్ల టిడిపికి వాస్తవ పరిస్థితి ఏవిధంగా ఉందో తెలుసుకునే అవకాశం ఉండడం లేదు.భజన ఎక్కువైతే ఎంతటి కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది.ఇప్పటికైనా చంద్రబాబు మీడియా ట్రాప్ నుంచి బయటపడి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తమ నిర్ణయాలను తీసుకుంటూ వెళితే గాని మళ్లీ టిడిపికి పునర్వైభవం వచ్చేలా కనిపించడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube