జనసేన బీజేపీ 'కాపు' క్యాంపులు ? మళ్లీ టీడీపీ కి దెబ్బే ?  

it is the telugu desam party that has lost the efforts of the bjp janasena parties to support the kapu caste, Janasena, BJP, TDP, ap, ysrcp, jagan, chandrababu - Telugu Ap, Bjp, Chandrababu, Jagan, Janasena, Kapu Caste, Tdp, Ysrcp

కాపు ముద్ర వేయించుకునేందుకు అటు తెలుగుదేశం పార్టీ, ఇటు బీజేపీ రెండు పార్టీలు విడివిడిగా పోటీ పడుతున్నాయి.2019 ఎన్నికల్లో మాదిరిగా కాకుండా, 2024 నాటికి బలమైన సామాజిక వర్గం అండదండలు సంపాదించాలని కసితో బీజేపీ , జనసేన పార్టీలు ఉన్నాయి.అందుకే ఏపీలో ప్రధాన సామాజిక వర్గమైన కాపులను దగ్గర చేసుకునేందుకు బీజేపీ జనసేన పార్టీ రెండూ రెండు దారుల్లో ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ మంత్రి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను బిజెపిలో చేర్చుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

TeluguStop.com - It Is The Telugu Desam Party That Has Lost The Efforts Of The Bjp Janasena Parties To Support The Kapu Caste

ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చేందుకు సిద్ధమైనా, ముద్రగడ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు.కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ కు తాను కట్టుబడి ఉన్నానని, కానీ ఆ డిమాండ్లు నెరవేర్చితే బీజేపీ లోకి వచ్చేందుకు తనకేమీ అభ్యంతరం లేదు అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

దీనిపై బీజేపీ స్పష్టమైన హామీ ఏది ఇవ్వలేకపోయింది.కానీ ఇక్కడే బీజేపీ అసలు సిసలు రాజకీయం బయటపడుతోంది.

TeluguStop.com - జనసేన బీజేపీ కాపు’ క్యాంపులు మళ్లీ టీడీపీ కి దెబ్బే -Political-Telugu Tollywood Photo Image

ముద్రగడ బీజేపీ లోకి వచ్చినా, రాకపోయినా, తమకేమీ ఇబ్బంది లేదని, ఆయన్ను కలిశాము కాబట్టి బీజేపి కాపులకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తోంది అనే సంకేతాలను ఇవ్వగలిగింది.ఇదిలా ఉంటే ఇప్పుడు కాపులు బీజేపీకి దగ్గరైనా, అలాగే జనసేన కు దగ్గరైనా ఆ రెండు పార్టీలకు కలిగే లాభం ఎంతో తెలియదు కానీ, ఇప్పుడు కాపులు బీజేపీకి కానీ, జనసేన కు కానీ దగ్గరైతే నష్టపోయేది తెలుగుదేశం పార్టీనే.

Telugu Ap, Bjp, Chandrababu, Jagan, Janasena, Kapu Caste, Tdp, Ysrcp-Telugu Political News

2019 ఎన్నికల్లో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ కాపులకు దూరం అయిందో ఇప్పుడు అదే సీన్ మళ్ళీ 2024 ఎన్నికల్లో రిపీట్ అయ్యే అవకాశం లేకపోలేదు.కాపు ఓట్ల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ లు పోటా పోటీ పడితే,  బీసీలు మరింత గా వైసిపికి దగ్గర అవుతారు.అప్పుడు మళ్లీ లాభపడేది వైసీపీనే అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

#Ysrcp #Janasena #Chandrababu #Kapu Caste #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు