అది మ‌న రైల్వేలో అత్యంత శక్తివంతమైన ఇంజిన్... దాని పూర్తి వివ‌రాలు తెలిస్తే..

It Is The Most Powerful Locomotive On The Main Railway If You Know Its Full Details

భారతీయ రైల్వేలు ప్రధానంగా రెండు రకాల లోకోమోటివ్‌ల నుండి సేవలను తీసుకుంటాయి.అవి ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లు, డీజిల్ లోకోమోటివ్‌లు.

 It Is The Most Powerful Locomotive On The Main Railway If You Know Its Full Details-TeluguStop.com

ఇవి కాకుండా ఆవిరి లోకోమోటివ్ రైళ్లు కూడా న‌డుస్తున్నాయి.అత్యంత శక్తివంతమైన లోకోమోటివ్‌లు గూడ్స్ రైలును లాగడానికి ఉపయోగిస్తారు.

వాటికి మరింత శక్తివంతమైన ఇంజిన్ అవసరం.మే 2020 ప్రారంభం వరకు డ‌బ్లుఏజీ 11 భారతీయ రైల్వేలలో అత్యంత శక్తివంతమైన రైలు ఇంజిన్‌.

ఇది 11 వేల హార్స్‌పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.అయితే 18 మే 2020న డ‌బ్లుఏజీ 12 బీ రాక‌తో డ‌బ్లుఏజీ 11ను తొల‌గించారు.

డ‌బ్లుఏజీ 12 తరగతికి చెందిన డ‌బ్లుఏజీ 12బీ ఇంజిన్ అధికారికంగా తొలి ప్రయాణం ప్రారంభించింది.ఇది బీహార్‌లోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ స్టేషన్ నుండి శివపూర్ వరకు మొదటి ప్రయాణాన్ని చేసింది.

ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ ఇంజిన్.ఇది మొత్తం 12 వేల హార్స్‌పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ప్రస్తుతం, డ‌బ్లుఏజీ 12 బీ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన లోకోమోటివ్.ఇది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రైలు ఇంజన్ల జాబితాలో చోటు ద‌క్కించుకుంది.

ఈ ఇంజన్ గరిష్ట వేగం 120 కిలోమీట‌ర్ ప‌ర్ అవ‌ర్‌.ఇది 6000 టన్నుల బ‌రువును 120 కి.మీ వేగంతో ముందుకు తీసుకువెళ్ల‌గ‌ల‌దు.

Indias most powerful Electric Locomotive WAG12B

#Train #Powerful #PanditDean #Wag

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube