అది అత్యంత విచిత్రమైన కాలీఫ్లవర్.. దాని ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు!

కాలీఫ్లవర్ గురించి తెలియనివారెవరూ ఉండరు.దీనిని వివిధ రకాల వంటకాలలో వినియోగిస్తుంటారు.

 It Is The Most Exotic Cauliflower Wonder Crazy Health People Demond , Cauliflower , Health , Romanesco Broccoli , Demond, Scientist Alexander Butches-TeluguStop.com

వైద్యులు కూడా దీనిని తినాలని సూచిస్తుంటారు.అయితే ఇప్పుడు పిరమిడ్‌లా కనిపించే ఒక విచిత్రమైన కాలీఫ్లవర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఈ కాలీఫ్లవర్ కిలో ధర రూ.2200 వరకు పలుకుతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.పిరమిడ్‌లా కనిపించే ఈ వింత క్యాబేజీని ప్రపంచవ్యాప్తంగా రోమనెస్కో కాలీఫ్లవర్ మరియు రోమనెస్కో బ్రకోలీ అని అంటారు.సెలెక్టివ్ బ్రీడింగ్‌కి ఇది గొప్ప ఉదాహరణ.ఈ కాలీఫ్లవర్‌ను మార్కెట్‌లో కిలో రూ.2200కు విక్రయిస్తున్నారు.ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు కూడా ఈ కాలీఫ్లవర్‌పై అధ్యయనం చేశారు.

ఈ కాలీఫ్లవర్ వింతగా కనిపించడానికి కారణం దాని పువ్వు.ఈ కాలీఫ్లవర్‌లోని కింది భాగం కాండంగా మారి.

 It Is The Most Exotic Cauliflower Wonder Crazy Health People Demond , Cauliflower , Health , Romanesco Broccoli , Demond, Scientist Alexander Butches-అది అత్యంత విచిత్రమైన కాలీఫ్లవర్.. దాని ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పైభాగం మొగ్గలా ఉంటుంది.

ఒక మొగ్గ పైన, మరొక మొగ్గ పెరుగుతుంది.

ఈ విధంగా అవి పిరమిడ్‌ల మాదిరిగా కనిపిస్తాయి.దీని గురించి శాస్త్రవేత్త అలెగ్జాండర్ బుచ్స్ మాట్లాడుతూ ఈ కాలీఫ్లవర్ గురించి మరింతగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది.

వ్యాధుల నివారణకు ఇది ఎంతలా ఉపయోపడుతుందో తెలుసుకోవాలన్నారు.

సాధారణ క్యాబేజీ, లేదా బ్రకోలీ కన్నా రోమనెస్కో కాలీఫ్లవర్‌లో పువ్వులు భిన్నంగా కనిపిస్తాయి.దీని రుచి దాదాపు వేరుశెనగ మాదిరిగా ఉంటుంది.దీనితో చేసిన వంటకం ఎంతో రుచికరంగా ఉంటుంది.

రోమనెస్కో కాలీఫ్లవర్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది.అమెరికా వంటి అనేక దేశాల్లో ప్రజలు వీటిని అత్యధికంగా కొనుగోలు చేస్తున్నారు.

ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, డైటరీ ఫైబర్స్ మరియు కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి, ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube