చేప‌లు ప‌ట్టుకోవ‌డానికి ఈ కొంగ వేసిన ప్లాన్ చూస్తే షాక్‌..

కూటి కోసం కోటి విద్య‌లు అనే సామెత మ‌నంద‌రికీ గుర్తు ఉంటుంది క‌దా.ఇప్ప‌టికీ ఈ సామెత‌కు సంబంధించిన ఘ‌ట‌న‌లు అక్క‌డ‌క్క‌డ చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

 It Is Shocking To See This Storks Plan To Catch Fish, Stork, Fish, Crane Plan To-TeluguStop.com

ఈ సామెత ఒక్క మ‌నుషుల‌కు మాత్ర‌మే కాదండోయ్ జంతువుల‌కు కూడా వ‌ర్తిస్తుంది.జంతువుల‌కు ఆహారం తింటేనే జీవితం గ‌డుస్తుంది.

లేదంటే మాత్రం జీవితం అక్క‌డితోనే పులిస్టాప్ ప‌డిపోతుంది.అందుకే జంతువులు ఎలాగైనా ఆహారాన్ని సంపాదించుకునేందుకు నానా తంటాలు ప‌డుతుంటాయి.

ఇప్పుడు కూడా ఓ కొంగ ప‌డుతున్న తంటాల గురించి తెలుసుకుందాం.

కొంగ‌కు చాలా అద్భుత‌మైన వేటగాడిగా పేరుంది.

చేప‌ల‌ను ప‌ట్టుకోవ‌డంలో కొంగ‌ల‌ది సెప‌రేటు ట్రెండ్ అనే చెప్పాలి.చేప‌ల‌ను వేటాడటంలో దీనికి ఉన్న నైపుణ్యం జాల‌ర్ల‌కు కూడా ఉండ‌దేమో అనిపిస్తుంది.

ఇప్పుడు ఓ కొంగ చేప‌ల‌ను ప‌ట్టుకునేందుకు వేసిన ప్లాన్ చూస్తే మాత్రం అస‌లు ఇలాంటి నైపుణ్యం ఇంకెవ‌రికీ ఉండ‌దేమో అనిపిస్తుంది.ఈ వీడియోలో మ‌నం జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే గ‌న‌క ఓ కొంగ త‌న‌కు ద‌గ్గ‌ర‌లోని ఓ నదిలో చేప‌లు ప‌ట్టేందుకు రెడీ అవుతుంది.

ఇందులో చేపల కోసం ఎప్ప‌టిలాగే ఒంటికాలు మీద నిల్చుని ఉంటుంది.

అయితే అచ్చం జాల‌ర్లు ఎలాగైతే చేప‌ల కోసం ఎరను విసురుతారో సేమ్ అలాగే ఇది కూడా ఎర‌ను విసురుతుంది.చేప‌ల కోసం ఆ కొంగ నీటిలోని ధాన్యాన్ని విసిర‌డంతో అవ‌న్నీ దాని ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఆ ధాన్యాన్ని తినేందుకు ట్రై చేస్తుంటాయి.ఇంకేముంది కొంగ‌కు చిక్కితే విడిచిపెడుతుందా.

అమాంతం ప‌ట్టుకుని వాటిని త‌న‌కు ఆహారంగా మార్చుకుంటుంది.ఇక ఇలా ఒక్కొక్క చేప‌ను ధాన్యాన్ని ఆశ చూపుతూ త‌నకు ఆహారంగా మార్చుకున్న విధానం అందరినీ షాక్ కు గురి చేస్తుంది.

దీన్ని చూసిన వారంతా కూడా వావ్ అని అన‌క మాన‌రేమో.మ‌రి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube