కామారెడ్డిని అభివృద్ధి చేసే బాధ్యత నాది..: కేటీఆర్

కామారెడ్డి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని తెలిపారు.

 It Is My Responsibility To Develop Kamareddy..: Ktr-TeluguStop.com

కామారెడ్డిని జిల్లా చేశాం.మెడికల్ కాలేజ్ ఇచ్చామన్న కేటీఆర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే జనవరిలో కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పారు.సౌభాగ్యలక్ష్మీ ద్వారా మహిళలకు రూ.3 వేలు అందిస్తామన్నారు.అలాగే తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు.రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా ఇస్తామని పేర్కొన్నారు.నాలుగున్నర లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామన్న కేటీఆర్ బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్, బీజేపీ కామారెడ్డికి పైసా ఇవ్వలేదని తెలిపారు.మోదీ దేశాన్ని ఆగం చేశారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube