రేవంత్ కోసం కష్టపడుతున్న కేసీఆర్ ?

టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు తెలంగాణలో రాజకీయంగా బలమైన శత్రువు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే.కాంగ్రెస్ పార్టీ కంటే రేవంత్ రెడ్డి అంటేనే కేసీఆర్ ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు.

 It Is Kcr Who Is Blocking The Post Of Revant Reddy-TeluguStop.com

రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో కేసీఆర్ ను ఎవరు విమర్శించలేనంత స్థాయిలో విమర్శిస్తూ అడుగడుగునా కేసీఆర్ కు ఇబ్బందులు తీసుకువస్తూ ఉంటారు.అందుకే కేసిఆర్ కాంగ్రెస్ పార్టీ, మిగతా రాజకీయ ప్రత్యర్ధులు కంటే రేవంత్ రెడ్డిని చూసే ఎక్కువగా భయపడుతున్నట్లుగా కనిపిస్తారు.

ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఉన్నారు.పి సిసి అధ్యక్ష పదవి కోసం ఆయన గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్ష పదవి కోసం సీనియర్ నాయకులంతా పోటీ పడుతున్నారు.

ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుంది అనేది ఉత్కంఠగా మారింది.కాకపోతే ఈ రేసులో ఎక్కువగా రేవంత్ రెడ్డి పేరే వినిపిస్తుంది.

కెసిఆర్ దూకుడుకి అడ్డుకట్ట వేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ కు మళ్ళీ పునర్వైభవం తీసుకు రాగలరని ఆ పార్టీ అధిష్టానం బలంగా నమ్ముతోంది.అయితే ఇప్పుడు రేవంత్ కు పిసిసి అధ్యక్ష పదవి దక్కకుండా కెసిఆర్ అడ్డు పడుతున్నట్లు తెలుస్తోంది.

దీనికోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన నాయకుడి ద్వారా కేసీఆర్ వ్యవహారం నడుపుతున్నట్లు తెలుస్తోంది.రేవంత్ కు సంబంధించిన అన్ని విషయాలను హైకమాండ్ దృష్టికి ఆ నేత కెసిఆర్ సూచనలతో తీసుకువెళ్లి పిసిసి అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం రేవంత్ రెడ్డి పట్నం గోస యాత్ర చేపడుతున్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వంపైన, కేసీఆర్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాడు.

Telugu Cm Kcr, Congress, Revant Reddy, Telangana Pcc-Telugu Political News

ఈ విమర్శలకు కు కెసిఆర్ కూడా కాస్త ఆందోళన చెందుతున్నాడు.అందుకే రేవంత్ దూకుడుకు కళ్లెం వేసేలా గతంలో రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కలిసి కొన్న ఓ ఐదెకరాల భూమి విషయాన్ని తెరపైకి తెచ్చారు.శేర్లింగంపల్లి మండలం గోపనపల్లి లో ఐదెకరాల భూమిని సోదరుడితో కలిసి రేవంత్ రెడ్డి అక్రమ మార్గంలో సొంతం చేసుకున్నారని, దీనికి అప్పటి రెవెన్యూ అధికారులు సహకరించారని ప్రభుత్వం విచారణ తేల్చింది.దీనికి బాధ్యత గా డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

ఇలా రేవంత్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలను వెలుగులోకి తెస్తూ ఆయన దూకుడుకు కళ్లెం వేయడంతోపాటు, పిసిసి అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకునేందుకు కెసిఆర్ గట్టిగానే కష్టపడుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube