షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు ఈ దుంప‌లు తింటే డేంజ‌రే..జాగ్ర‌త్త‌!

It Is Dangerous For Diabetics To Eat These Root Vegetables! Diabetics, Root Vegetables, Diabetes, Diabetic Patient, Potato, Elephant Foot Yam, Sweet Potato, Red Radish, Health Tips, Good Health, Health,

మ‌ధుమేహం లేదా షుగ‌ర్ వ్యాధి.ఒక్క‌సారి దీని బారిన ప‌డ్డామంటే జీవిత కాలంలో మందులు వాడాల్సి ఉంటుంది.

 It Is Dangerous For Diabetics To Eat These Root Vegetables! Diabetics, Root Vege-TeluguStop.com

అలాగే ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపులో ఉంచుకోవాలి.

మ‌రియు కొన్ని కొన్ని ఆహారాలకు సైతం దూరంగా ఉండాలి.అయితే అటువంటి ఆహారాల్లో కొన్ని దుంపులు కూడా ఉన్నాయి.

మ‌రి ఆ దుంప‌లు ఏంటి.? అస‌లు వాటిని షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ఎందుకు తిన‌కూడ‌దు.? అన్న విష‌యాలు ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

కంద గడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన‌ప్ప‌టికీ షుగ‌ర్ వ్యాధి ఉన్న వారు మాత్రం దీనిని దూరం పెట్టాల్సిందే.

ఎందుకంటే కంద గ‌డ్డ‌లో ఉండే కొన్ని పోష‌కాలు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను పెంచేస్తాయి.

అలాగే తియ్య‌గా, రుచిగా ఉండే చిల‌క‌డ‌దుంప‌ల‌నూ మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు తిన‌రాద‌ని అంటున్నారు.

వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌డ‌మే కాకుండా.వారిలో జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు తిన‌కూడ‌ని దుంప‌ల్లో ఎర్ర ముల్లంగి ఒక‌టి.ఇందులో పిండి పదార్ధాలు మ‌రియు చ‌క్కెర అధిక శాతంలో ఉంటాయి.

అందు వ‌ల్ల, ఎర్ర ముల్లంగి తీసుకుంటే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపు తప్పి డేంజ‌ర్‌లో ప‌డ‌తారు.

బంగాళ దుంపుల్లోనూ కొవ్వులు, పిండి ప‌దార్థాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.కాబ‌ట్టి, వీటిని సైతం షుగ‌ర్ వ్యాధితో ఇబ్బంది ప‌డే వారు చాలా త‌క్కువ‌గా తీసుకోవాలి.లేదా తీసుకోవ‌డ‌మే మానేయాలి.

ఇక పైన విష‌యాలు చ‌దివిన త‌ర్వాత‌ మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు ఏ ఏ దుంప‌లు తినాలి.? అన్న సందేహం మీలో మొద‌ల‌య్యే ఉంటుంది.అయితే క్యారెట్‌, తెల్ల ముల్లంగి, బీట్ రూట్ వంటి దుంపుల‌ను లిమిట్‌గా తీసుకోవ‌చ్చు.వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.మ‌రియు శ‌రీరానికి బోలెడ‌న్ని పోష‌క విలువలు కూడా ల‌భిస్తాయి.

It Is Dangerous For Diabetics To Eat These Root Vegetables! Diabetics, Root Vegetables, Diabetes, Diabetic Patient, Potato, Elephant Foot Yam, Sweet Potato, Red Radish, Health Tips, Good Health, Health, - Telugu Diabetes, Diabetic, Diabetics, Elephant Yam, Tips, Potato, Red Radish, Root Vegetables, Sweet Potato #TeluguStopVideo

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube