రమణ ను 'కారు' ఎక్కించింది ఎవరు 'బాబు' ?

టీడీపీ అధినేత చంద్రబాబు పరోక్షంగా తెలంగాణ రాజకీయాలను వదిలి పెట్టేశారు.ఏదో నామమాత్రంగానే స్థానిక నాయకుల ద్వారా వ్యవహారాలను చక్కబెట్టేస్తున్నారు.

 L Ramana, Trs, Congress, Revanth Reddy Bjp, Pcc President, Cbn, Chandrababu, Tdp-TeluguStop.com

పూర్తిగాఆయన ఏపీ రాజకీయాలపైనే దృష్టి సారించారు.తెలంగాణలో ఎంత పోరాటం చేసినా టిడిపి పుంజుకునే అవకాశం లేదని, తమ పార్టీపై ఆంధ్ర ముద్ర ఎలాగూ ఉంటుంది కాబట్టి బాబు పెద్దగా ఇక్కడ వ్యవహారాలను పట్టించుకోవడం మానేశారు.

అయితే పార్టీలో ఉన్న కీలక నాయకులను వివిధ పార్టీల్లో చేర్పించి, అక్కడ విషయాలను తెలుసుకుంటారు అనే విమర్శలు ఆయనపై ఉన్నాయి.ఈ విధంగానే రేవంత్ రెడ్డి ని చంద్రబాబు స్వయంగా కాంగ్రెస్ లోకి వెళ్లేలా ప్రోత్సహించారని, ఆయన పిసిసి అధ్యక్ష పదవి దక్కించుకునే విషయంలోనూ బాబు పాత్ర ఉందనే విమర్శలు వస్తూనే ఉన్నాయి.

Telugu Ap Tdp, Chandrababu, Congress, Ramana, Pcc, Telangana Tdp-Telugu Politica

అంతేకాకుండా టీడీపీ కి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులు బీజేపీలో చేరడం వెనక బాబు ఉన్నారని వైసిపి నాయకులు విమర్శలు చేస్తూనే ఉంటారు.తాజాగా టిడిపి సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొంది, దాదాపు 30 ఏళ్ల నుంచి ఆ పార్టీతో అనుబంధం పెంచుకున్న కరీంనగర్ జిల్లాకు చెందిన ఎల్.రమణ టిడిపి అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేశారు.తాజాగా ఆయన టిఆర్ఎస్ లో చేరిపోయారు.

అయితే రమణ టిఆర్ఎస్ లోకి వెళ్లే విధంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించార ని, ఆయన ప్రోద్బలంతోనే రమణ టిఆర్ఎస్ లో చేరారు అనే విమర్శలను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు.

Telugu Ap Tdp, Chandrababu, Congress, Ramana, Pcc, Telangana Tdp-Telugu Politica

రేవంత్ చంద్రబాబు మనిషి అంటూ టిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్న క్రమంలో రమణ కూడా చంద్రబాబు మనిషి అంటూ కాంగ్రెస్ విమర్శలు మొదలు పెట్టింది.దీంతో నిజంగానే రమణను చంద్రబాబు టిఆర్ఎస్ లోకి వెళ్లేలా ప్రోత్సహించారా ? రమణ ద్వారా టిఆర్ఎస్ కి సంబంధించిన కీలక విషయాలను తెలుసుకోబోయే ప్రయత్నాల్లో ఉన్నారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube