మన దేశం ఎన్నో అత్యంత విలువైన వస్తువులను ప్రపంచానికి అందించింది.అందులో కోహినూరు వజ్రం ఒకటిని చెప్పొచ్చు.
ఇది తప్ప ఇంకా మన దేశం నుంచి వేరే చోటికి తరలి వెళ్లిన విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి.వాటిలో మొఘల్ రాజుల కాలంలో ముద్రించిన రెండు బంగారు నాణేలు కూడా ఉన్నాయి.
ఈ రెండిటిని జహంగీర్ ముద్రించాడు.వాటిలో ఒక గోల్డ్ కాయిన్ పేరు కౌకబ్-ఇ-తాలి.
దీని బరువు అక్షరాలా 12 కిలోలు.అంటే దీని ధర ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
దానికి తోడు ఇది చాలా అరుదైనది కాబట్టి దీని ప్రైస్ మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు.అయితే ఇంత ఘన చరిత్ర కలిగిన ఈ కాయిన్ సుమారు 40 ఏళ్ల నుంచి ఆచూకీ లేకుండా మాయమైంది.
చరిత్రకారుల ప్రకారం, జహంగీర్ ముద్రించిన రెండు నాణేలలో ఒక దానిని ఇరాన్ రాయబారి యాద్గర్ అలీకి బహుమతిగా ఇచ్చారు.మిగిలిన ఇంకొకటి నిజాం పాలకులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ అతిపెద్ద గోల్డ్ కాయిన్‌ను ఆగ్రాలో ముద్రించారని జహంగీర్ తన ఆత్మ కథలో రాశాడు.సీబీఐ అధికారుల ప్రకారం, నిజాం పాలకులలో హైదరాబాద్ 8వ నిజాం ముఖరం జా ప్రపంచంలోనే అత్యంత పెద్దయిన 12 కిలోల బరువున్న నాణేన్ని స్విస్ బ్యాంకులో వేలం వేశాడట.
దీని గురించి బయటకు తెలియడంతో అధికారులు ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.ఇది జరిగింది 1987వ సంవత్సరంలో.ఆ సమయంలో సీబీఐలో ఎక్కువ అధికారులు కూడా లేరు.అందువల్ల ఈ కేసుని పూర్తిస్థాయిలో ప్రభుత్వం సాల్వ్ చేయలేకపోయింది.
కాగా మళ్లీ ఇప్పుడు భారత ప్రభుత్వం ఆ బంగారు నాణేం జాడ కనిపెట్టి, దాన్ని ఇండియాకు తీసుకురావాలని యోచిస్తోంది.ఇప్పటికే ఆ దిశగా చర్యలు స్టార్ట్ చేసినట్లు సమాచారం.