అమెరికన్స్ కి ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్...ట్రంప్ ఫుల్ హ్యాపీ..!!

కరోనా కోరల్లో చిక్కుకున్న అమెరికాలో ప్రస్తుతం నిరుద్యోగం తాండవం చేస్తోంది.కోట్లాది మంది ఉపాది దొరకక అల్లాడి పోతున్నారు.

 Infosys Announces Employment To American Youth, Coronavirus, Infosys, Covid Effe-TeluguStop.com

ఎన్నో కుటుంభాలు రోడ్డున పడ్డాయి.నిలువ నీడ లేక, అద్దెలు కట్టడానికి డబ్బులు లేక చెట్ల కింద, పుట్ పాత్ లపై తలదాచుకుంటున్న కుటుంభాలు లెక్కకి మించే ఉన్నాయి.

ఇదిలాఉంటే ఈ పరిస్థితుల నుంచీ గట్టేక్కడానికి ట్రంప్ స్థానికులకే ఉద్యోగాలు ఇవలంటూ పలు కంపెనీలకి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా వలస వాసుల పై ఎన్నో ఆంక్షలు పెట్టారు.ఫలితంగా అమెరికాలో ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి.

చివరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలలో కూడా ముందుగా అమెరికన్స్ ని నియమించుకోవాలని ఆదేశాలు ఇచ్చారు ట్రంప్…ఈ క్రమంలోనే

అమెరికాలో ప్రఖ్యాత ఐటీ కంపెనీలు స్థానికులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.రెండు రోజుల క్రితం ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ అమెరికన్స్ కి 15 వేల ఉద్యోగాలు కల్పిస్తున్నామని ప్రకటించిన విషయం విధితమే.

ఈ కోవలోనే ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అమెరికాలో సుమారు 12 వేల మంది అమెరికన్స్ కి ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్దమయ్యింది.ఈ మేరకు ఓ ప్రకటన కూడా చేసింది.

రానున్న ఐదేళ్ళలో సుమారు 25 వేల మంది స్థానిక అమెరికన్స్ కి అవకాశాలు ఇస్తామని ప్రకటించింది.

ట్రంప్ గడించిన ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా అమెరికాలో ఐటీ ఉద్యోగాలలో అధికశాతం స్థానికులకే దక్కేలా చేస్తానని హామీ ఇచ్చారు.ఈ నేపధ్యంలో ప్రస్తుతం కొన్ని నెలలుగా ఐటీ కంపెనీలు అమెరికన్స్ కి ఉద్యోగాలు ఇవ్వడంలో ఆసక్తి చూపిస్తున్నాయి.2017 లో సుమారు 13 వేల ఉద్యోగాలు కేవలం అమెరికన్స్ కే ఇచ్చిన ఇన్ఫోసిస్ తాజాగా మరో 15 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తానని ప్రకటించడంతో ట్రంప్ వర్గ సంతోషం వ్యక్తం చేసింది.ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో అమెరికన్ యువతకి ఉద్యోగాలు విషయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరడం ట్రంప్ కి కలిసొచ్చే విషయమని అంటున్నారు పరిశీలకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube