Smart Phones : SMS సేవలు అందుబాటులోకి వచ్చి 30 ఏళ్లు.. తొలి టెక్స్ట్ అదే!

ప్రస్తుతం స్మార్ట్ యుగం నడుస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 90% మంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

 It Has Been 30 Years Since Sms Services Became Available The First Text Is The-TeluguStop.com

ఈ ప్రస్తుత దైనందిత జీవితంలో అదిలేకుండా పనే సాగడం లేదు.అవును, స్మార్ట్‌ఫోన్ లేనిదే ఏ పనీ చేయలేని పరిస్థితి దాపురించిందంటే వాటి ప్రత్యేకత ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

మొదట మెసేజింగ్ సర్వీస్ అందుబాటులోకి వచ్చాక ఫ్రెండ్స్, బంధువులతో దాదాపు అందరు టెక్స్ట్ చేసేవారు.ఎందుకంటే ఇది కాల్ కంటే కాస్త చీప్ అని భావించేవారు.

అయితే మొట్ట మొదటి మెసేజ్ ఎప్పుడు, ఎవరు, ఎవరికి చేశారో తెలుసా?

మొబైల్స్ ఫోన్ ద్వారా టెక్ట్స్ మెసేజ్ సర్వీస్ ప్రారంభమై శనివారం నాటికి అంటే డిసెంబర్ 3 నాటికి 30 ఏళ్లు పూర్తయ్యాయని మీలో ఎంతమందికి తెలుసు.మొట్ట మొదటి మెసేజ్‌ను యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బెర్క్‌షైర్‌కు చెందిన వొడాఫోన్ ఇంజినీర్ నీల్ పాప్‌వర్త్ సెండ్ చేసారు.

వొడాఫోన్‌కు డైరెక్టర్‌గా ఉన్న రిచర్డ్ జార్విన్‌కు 1992 డిసెంబర్ 3న మేరీ క్రిస్మస్ అని తొలి మెసేజ్‌ను నీల్ పంపాడు.ఆ మరుసటి ఏడాది నోకియా సంస్థ SMS పంపించే మొబైళ్లను మార్కెట్లోకి విడుదల చేయడం గమనార్హం.

Telugu Latest, Mary Christmas, Message-Latest News - Telugu

ఇక ఆ తర్వాత SMSలు మనిషి నిత్య జీవితంలో ఒక భాగం అయిపోవడం మనం చూసాము.మనం కూడా మొదట మెస్సేజ్ ఎంతో ఉత్సుహకతతో పంపడం ఈపాటికి కూడా గుర్తుండే ఉంటుంది.ఇక ఆ తర్వాత కాలంలో మెసేజ్‌లలో ఉపయోగించే ఎమోజీలను జపాన్ రూపొందించిందని మీకు తెలుసా? ప్రపంచంలోనే తొలి మెసేజ్‌ను తానే పంపించానని ఇటీవల తన పిల్లలకు చెప్పానని, తాను పంపించిన ఆ మెసేజ్ చరిత్రలో నిలిచిపోతుందని అప్పుడు ఊహించలేదని రిచర్డ్ అన్నారు.అయితే ప్రస్తుతం వాట్సాప్ వంటి సోషల్ మెసేజింగ్ రాకతో SMSలకు ప్రాధాన్యం తగ్గిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube