టీఆర్ఎస్ కు 'ఐటీ' అటాక్ ? లెక్కలు చెప్పాలంటూ నోటీసులు ?

నేనే రాజు నేనే మంత్రి ఇ అన్నట్టుగా తెలంగాణలో పరిపాలన చేసుకుంటూ తనకు ఎదురు లేకుండా వరుస విజయాలతో ముందుకు వెళ్తున్న కెసిఆర్ ప్రభుత్వానికి ఇప్పుడు ఐటీ శాఖ ఝలక్ ఇచ్చింది.ఆ పార్టీలో ఉన్న కీలక నాయకులు, మంత్రులకు నోటీసులు జారీ చేసింది.

 It Give The Notices To Trs Ministers-TeluguStop.com

ఈ నోటీసులు అందుకున్న వారిలో మంత్రులు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండడంతో టిఆర్ఎస్ ఇప్పుడు బెంబేలెత్తిపోతోంది.ఇంతకీ ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేయడం గల కారణాలు ఏంటి అంటే మూడు సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన ‘గులాబీ కూలి’ అనే ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు లెక్కలు చెప్పాలంటూ ఈ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

నోటీసులు అందుకున్న వారిలో కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ తదితరులు ఉన్నట్టుగా తెలుస్తోంది.

Telugu Congressmp, Harishrao, Tax, Trsministers-Movie

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఐటీ శాఖ రంగంలోకి దిగి ఈ నోటీసులు జారీ చేసినట్లుగా సమాచార.టిఆర్ఎస్ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా మూడు సంవత్సరాల క్రితం ప్రగతి నివేదన సభను నిర్వహించింది.ఆ సందర్భంగా గులాబీ కూలి పేరుతో సభకు హాజరయ్యే కార్యకర్తల కోసం టిఆర్ఎస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ఉత్తుత్తి కూలిపనులు చేసి లక్షల రూపాయలు సంపాదించారని, అందుకే ఐటీ శాఖ నుంచి ఈ విధంగా నోటీసు వచ్చినట్లు సమాచారం.

Telugu Congressmp, Harishrao, Tax, Trsministers-Movie

అధికార పార్టీ టిఆర్ఎస్ నిధులు దుర్వినియోగం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది అంటూ అప్పట్లో ఆయన అనేక కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు.దీంతో ఐటి శాఖ ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం ఉన్న నాయకులు ఒక్కొక్కరికి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.అయితే ఈ వ్యవహారాన్ని బయటకి పొక్కకుండా టిఆర్ఎస్ పార్టీ జాగ్రత్తలు పడుతోంది.

దీనిపైనా ఇప్పటివరకు ఆ పార్టీ నాయకులు ఎవరూ స్పందించలేదు.ఐటీ నోటీసులకు ఏ సమాధానం చెప్పాలి ? అనే దానిపైన టీఆర్ఎస్ నాయకులు మథనపడుతున్నట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube