ఆ విషయం చెప్పండమ్మా : కేసీఆర్ కు ఐటీ నోటీసులు ! ఆ ఎమ్యెల్యేలకు కూడా

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది.ఇప్పటికే ఏపీలో టీడీపీ నాయకులే టార్గెట్ గా ఐటీ శాఖ దాడుల మీద దాడులు నిర్వహించి కలకలం రేపిన సంగతి తెలిసిందే.

 It Department Issues Notices To Kcr-TeluguStop.com

తాజాగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులే లక్ష్యంగా నోటీసులు జారీ కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది.గత ఎన్నికల సమయంలో నామినేషన్ సందర్భంగా డిక్లరేషన్ లో పేర్కొన్న ఆస్తులకు 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల సమయంలో డిక్లేర్ చేసిన ఆస్తులకు మధ్య చాలా తేడా ఉందని ఐటీ శాఖ గుర్తించింది.

పెరిగిన ఆదాయాన్నిఐటీ రిటర్న్స్‌లో చూపించలేదని ఆ శాఖ అధికారులు గుర్తించారు.ఈ నాలుగేళ్ల ఐటీ రిటర్న్స్, ఆస్తులను పరిశీలించిన తరువాత కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది

కేసీఆర్ ఆస్తి 2014లో రూ.15.16 కోట్లుండగా.2018 ఎన్నికల అఫిడవిట్ నాటికి అది రూ.23.55 కోట్లకు చేరింది.ఇంకో విషయం ఏంటి అంటే ఐటీ శాఖ నోటీసులు కేవలం కేసీఆర్ ఒక్కడికే కాదు అనేకమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకూ ఈ నోటీసులు అందినట్లు ప్రచారం జరుగుతోంది.

భారీగా ఆస్తులు పెరిగిన ఎమ్మెల్యేలు ఈ నోటీసులు అందుకున్నట్టు టాక్.కేటీఆర్ ఆస్తి నాలుగేళ్ల కాలంలో రూ.7.98 కోట్ల నుంచి రూ.41.83 కోట్లకు పెరిగింది.అలాగే దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ నాలుగేళ్లలో వారు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ ను మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.వారికి కూడా నోటీసులు పంపినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి.మిగతా రాష్ట్రాలతో పోల్చితే కేసీఆర్ ముందస్తు ఎన్నికలవైపు మొగ్గు చూపి ఎన్నికలకు వెళ్ళాడు.

అందుకే 0 ఆ ఎన్నికల్లో అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నోటీసులు జారీ చేసినట్లు భావిస్తున్నారు.అయితే ఈ నోటీసులు సాధారణంగానే వస్తూ ఉంటాయని.

వీటికి వివరణ పంపితే చాలని, దీనిపై అంత రచ్చ అనవసరమని కొంత మంది వాదిస్తున్నారు.కాకపోతే తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

అక్కడ.పోటీ చేసిన అభ్యర్థులు ఎవరికీ ఐటీ శాఖ నోటీసులు జారీ చేయలేదు.

కేవలం టీఆర్ఎస్ పార్టీకి చెందినవారికి మాత్రమే నోటీసులు జారీ అవ్వడం వెనుక ఏదైనా రాజకీయం ఉందా అనే కోణంలో టీఆర్ఎస్ అనుమానం వ్యక్తం చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube