టీడీపీ ఎమ్మెల్సీ ఆస్తులపై ఐటీ దాడులు !   IT Attacks On Tdp Mlc Magunta Srinivasareddy Companies     2018-12-08   16:17:42  IST  Sai M

గత కొద్ది రోజుల క్రితం ఏపీలో టీడీపీ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా ఐటీ దాడులు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ దాడుల్లో ఎన్నో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు కొంతమందికి నోటీసులు కూడా పంపించారు. ఇక తెలంగాణాలో ఎన్నికల తంతు పూర్తవ్వడంతో ఇప్పుడు మళ్ళీ ఏపీలో ఐటీ దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజాగా…నెల్లూరులో ఒంగోలు మాజీ ఎంపీ, టీడీపీ నేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిప కంపెనీలపై ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు… మాగుంట కుటుంబానికి చెందిన కంపెనీలపై నిన్నటి నుంచి ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి… చెన్నై టి.నగర్ లోని కార్పొరేట్ కార్యాలయంతో పాటు పూనమల్లి రోడ్ లోని ఫ్యాక్టరీపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇక చెన్నైలో నెల్లూరుకు చెందినవారికి సంబంధించిన సవేరా హోటల్ లోని ప్రైవేట్ లాకర్లలో పెద్ద ఎత్తున బంగారం, నగదు నిల్వలు దా చిపెట్టినట్టు ఐటీ అధికారులకు సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.