టీ.. నేతలతో బాబుకు చిరాకు!!

తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అసలే అంతంత మాత్రం అయితే.ఇదిలా ఉంటే.

 Issue In Telangana Tdp-TeluguStop.com

మరో పక్క తెలుగుదేశం తెలంగాణ నేతలలో ఏర్పడ్డ భిన్నాభిప్రాయాలు పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు కు చికాకు కలిగిస్తున్నాయి, విషయం ఏమిటంటే.పార్టీ వర్గాల కధనం ప్రకారం టిడిపి ఫైర్ బ్రాండ్ గా పేరొందిన రేవంత్ రెడ్డి తీరుపై కొందరు నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.

రేవంత్ పార్టీ సమావేశాలకు రారని, ఏదో ఒకటి మాట్లాడతారని, ఆ తర్వాత దాని గురించి పాలో అప్ చేయరని వారు ఆరోపించారు.ఇది అంగీకారయోగ్యంగాదని వారు పేర్కొన్నారు.

చంద్రబాబు వద్ద సమావేశమైన ఎర్రబెల్లి దయాకరరావు,ఎల్.రమణ తదితరులతో సంభాషణలు జరిగినప్పుడు ఈ ప్రస్తావన వచ్చిందని అంటున్నారు.

కాగా టిడిపి తెలంగాణ నేతలను నిలబెట్టుకుని,పార్టీని పరిరక్షించుకునేందుకు గాను కొందరు ఈ ప్రాంత నేతలకు పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు.

అలాగే ముగ్గురు నేతలకు టిటిడిలో సభ్యత్వం ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.ఏది ఏమైనా నేతలు అండౌ కలసికట్టుగా పనిచేసి మళ్లీ తెలంగాణాలో పసుపు జెండాను రెప రెప లాడించాలి అని కోరుకుంటున్నారు పార్టీ కార్యకర్తలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube