స్ఫూర్తి : దేశం మొత్తంతో ఓదార్పు పొందిన ఇస్రో చైర్మన్‌ శివన్‌

కొన్ని రోజుల ముందు వరకు కె శివన్‌ అంటే ఎవరికి తెలియదు.కాని ఇప్పుడు కె శివన్‌ అంటే దేశం మొత్తంకు తెలిసు.

 Isrochairman Kailasavadivoo Sivan Inspiration Journey1-TeluguStop.com

చంద్రయాన్‌ 2 ప్రయోగం ప్రారంభించినప్పటి నుండి కూడా శివన్‌ పేరు మారుమ్రోగుతూనే ఉంది.మీడియా ముందుకు ఈ ప్రయోగంకు సంబంధించిన విషయాలను తెలియజేసేందుకు ఆయన రావడం జరిగింది.

ఆయన్ను చూస్తే ఒక సింపుల్‌, సాదారణ వ్యక్తి మాదిరిగా అనిపిస్తాడు.ఈయన ఇస్రోకు చైర్మనా అన్నట్లుగా అనిపిస్తాడు.

గొప్పవాళ్లు అంతా కూడా అలాగే ఉంటారని మరోసారి శివన్‌ నిరూపించాడు.చంద్రయాన్‌ 2 ప్రయోగం విఫలం అయినా కూడా దేశ ప్రజల గుండెలను గెలుచుకున్న శివన్‌ ప్రస్తుతం టాఫ్‌ ఆఫ్‌ ది నేషన్‌.

ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది నేషన్‌ అయిన శివన్‌ ఈ స్థాయికి అంత సులభంగా రాలేదు.తండ్రి ప్రోత్సాహం, కుటుంబ సభ్యులు వెన్ను దన్నుగా నిలిచి ఈయన్ను ఈ స్థాయికి తీసుకు రాలేదు.

పూర్తిగా తన కష్టంతోనే, తన ప్రతిభతోనే పైకి వచ్చాడు.శివన్‌ తండ్రి ఒక వ్యవసాయ రైతు, ఇక ఆయన కుటుంబంలో శివన్‌ మొదటి గ్రాడ్యుయేషన్‌ చేసిన వ్యక్తి.

అలాంటి కుటుంబం నుండి వచ్చిన శివన్‌ ప్రపంచం దృష్టిని ఇండియా వైపు తిప్పుకునేలా చేసిన చంద్రయాన్‌ 2 ప్రయోగంకు చీప్‌గా వ్యవహరించాడు.

Telugu Inspired Minds, Indianspace, Isro Chairman, Pm Modi-

తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతంకు చెందిన కైలాసవాడివో అనే ఒక వ్యవసాయ రైతు కుటుంబంలో శివన్‌ జన్మించాడు.తమిళ సాంప్రదాయం ప్రకారం తండ్రి పేరు కొడుకు ఇంటి పేరు అవుతుంది.అలా శివన్‌ తన తండ్రి పేరును ఇంటి పేరుగా మల్చుకుని కైలాసవాడివో శివన్‌ అలియాస్‌ కె శివన్‌ అయ్యాడు.

ఆర్థిక పరిస్థితులు బాగాలేక చదువు మానేయమంటే ప్రభుత్వ పాఠశాలలో బండ్రిని బతిమిలాడుకుని చదివిన శివన్‌ ప్లస్‌ టూ వరకు కూడా అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు.ప్లస్‌ టూ చదువుతున్నప్పటి వరకు కూడా శివన్‌ కనీసం చెప్పులు లేకుండానే స్కూల్‌కు వెళ్లాడు.

ఆ సమయంల ఆయన వద్ద కేవలం రెండు జతల బట్టలు మాత్రమే ఉండేవి.గ్రాడ్యుయేషన్‌కు కూడా శివన్‌ పంచ కట్టుకుని వెళ్లేవాడు.ప్లస్‌ టూ తర్వాత ఇంజనీరింగ్‌ చేయాలని ఆశ పడ్డ శివన్‌ ఆశలపై ఆయన తండ్రి నీళ్లు జల్లాడు.ఆ స్థాయిలో డబ్బులు పెట్టడం తన వల్ల కాదంటూ చేతులు ఎత్తేశాడు.

మన కుటుంబంలో గ్రాడ్యుయేట్‌ లేడు కనుక నువ్వు గ్రాడ్యుయేషన్‌ చేయాలని శివన్‌కు తండ్రి సూచించాడు.తండ్రి మాట ప్రకారం గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు.

Telugu Inspired Minds, Indianspace, Isro Chairman, Pm Modi-

 

కొడుకు శివన్‌ పట్టుదల చూసి కైలాసవాడివోకు నమ్మకం కలిగింది.ఆ సమయంలో కొంత భూమి అయినా అమ్మి కొడుకును చదివించాలని నిర్ణయించుకున్నాడు.డిగ్రీ అయిన తర్వాత ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ను చదివాడు.ఆ సమయంలో ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌కు ఎక్కువ ఓపెనింగ్స్‌ ఉండేవి కాదు.అయినా కూడా తన ప్రయత్నం మానుకోకుండా ప్రయత్నించాడు.తన చిన్నతనంలో పడ్డ కష్టాలను, ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ ఆయన జీవితం సాగించాడు.

ఇస్రోలో మెల్ల మెల్లగా తన కెరీర్‌ను ప్రారంభించి ఏకంగా ఇస్రో చైర్మన్‌ స్థాయికి వెళ్లాడు.డాక్టర్‌ శివన్‌ జీవితంలో అనుభవించిన చేదు సంఘటనలు, ఆయన సాధించిన విజయాలు ఈతరం యువతకు స్ఫూర్తి దాయకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube