చంద్రయాన్‌ 2 : ల్యాండర్‌ విక్రమ్‌ జాడ గుర్తింపు  

Isro Scientiest Shivan Find The Chandrayan 2 Lander Vikram-lander Vikram,shivan,telecommunication

మొన్న అర్థరాత్రి వరకు దేశ ప్రజలంతా ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూసిన చంద్రయాన్‌ 2 ఆఖరి ఘటం చివరి నిమిషంలో విఫలం అయిన విషయం తెల్సిందే.ల్యాండర్‌ విక్రమ్‌ నుండి సంకేతాలు అందక పోవడంతో అంతా నిరాశ చెందారు.మళ్లీ సిగ్నల్స్‌ను రీచ్‌ చేయడం అసాధ్యం అంటూ ఇస్రో శాస్త్రవేత్తలు కూడా భావించారు.అయితే అనూహ్యంగా మళ్లీ జనాల్లో ఆశలు చిగురించేలా ఇస్రో చైర్మన్‌ శివన్‌ స్వయంగా ప్రకటన చేశారు.

Isro Scientiest Shivan Find The Chandrayan 2 Lander Vikram-lander Vikram,shivan,telecommunication-Isro Scientiest Shivan Find The Chandrayan 2 Lander Vikram-Lander Vikram Shivan Telecommunication

ల్యాండర్‌ విక్రమ్‌ జాడను తాము గుర్తించినట్లుగా ఆయన ప్రకటించాడు.ప్రస్తుతానికి తాము ఇక్కడ నుండి సిగ్నల్స్‌ను పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.

చంద్రయాన్‌ 2 ద్వారా ప్రయోగించిన ఆర్బిటర్‌ విక్రమ్‌ జాడను గుర్తించిందని అన్నారు.ఒక ఫొటోను కూడా తమకు పంపించినట్లుగా శివన్‌ ప్రకటించారు.ప్రస్తుతం ల్యాండర్‌తో సంబంధాలు కలిపేందుకు తమ శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.విక్రమ్‌కు సిగ్నలింగ్‌ వ్యవస్థ పునరుద్దరించబడితే ప్రయోగం కొనసాగించవచ్చు అన్నారు.రోవర్‌ను కిందకు దించడం పెద్ద పని కాదన్నట్లుగా శాస్త్రవేత్తలు అంటున్నారు.పూర్తిగా నమ్మకం కోల్పోని శాస్త్రవేత్తలు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.ప్రస్తుతం అక్కడ నుండి సిగ్నల్స్‌ అయితే రావడం లేదు.మొదట క్రాష్‌ ల్యాండింగ్‌ అయ్యి ఉంటుందని అనుకున్నారు.కాని అలాంటిది ఏం కాలేదని శివన్‌ ప్రకటించారు.దాంతో దేశ జనాలు అంతా కూడా మళ్లీ ఆసక్తిగా చంద్రయాన్‌ 2 ప్రయోగం గురించి తెలుసుకుంటున్నారు.