చంద్రయాన్-2 తీసిన మొదటి భూమి ఫోటోలు! సోషల్ మీడియాలో వైరల్

భారత శాస్త్రవేత్తల బృందం కొద్ది రోజుల క్రితం ఇస్రో నుంచి చంద్రయాన్-2 ప్రయోగం ద్వారా విజయవంతంగా శాటిలైట్ ని గగనతలంలోకి పంపించారు.చంద్రుడిపై ల్యాండ్ కాబోతున్న ఈ శాటిలైట్ లు ఆర్బిటర్, విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ త్వరలో త్వరలో చంద్రుడి కక్ష్యలోకి వెళ్లనున్నాయి.

 Isro Releases First Set Of Earth Pictures Captured By Chandrayaan 2-TeluguStop.com

కొద్ది రోజుల క్రితం చంద్రయాన్ తీసిన ఫోటోలు అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి.అయితే అవి వాస్తవం కాదనే విషయం తర్వాత శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

ఇదిలా ఉంటే తాజాగా శాటిలైట్ లో విక్రమ్ ల్యాండర్ తీసిన ఫోటోలను ఇస్రో సోషల్ మీడియాలో విడుదల చేసింది.ఎల్ఐ4 కెమెరాతో విక్రమ్ ల్యాండర్ ఈ ఫోటోలను తీసినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేశారు.ఇదిలా ఉంటే చంద్రయాన్-2 ద్వారా ఆవిష్కరించబడిన మొట్టమొదటి ఫోటోలు కావడంతో ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.నీలం రంగులో ఉండే భూమి ఉపరితలాన్ని ఈ ఫోటోలు ఆవిష్కరించాయి.శనివారం సాయంత్రం 5.28 నుంచి 5.37 నిమిషాల మధ్య శాటిలైట్ ఈ ఫొటోలు తీసింది.అమెరికా ఉపఖండం పసిఫిక్ మహాసముద్రం ఫొటోలను చంద్రయాన్ 2 తీసింది.చంద్రయాన్2 ఫొటోలు చాలా క్లారిటీగా ఉండడంతో ఈ ప్రయోగం విజయవంతం అయ్యిందనే ధీమాలో శాస్త్రవేత్తలు ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube