ఫలించిన ఇస్రో ప్రయోగం.. కక్ష్యలోకి పీఎస్ఎల్వీ సి 51 రాకెట్.. !

మొట్టమొదటి సారిగా ప్రయివేట్ సంస్థల భాగస్వామ్యంతో ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ సి 51 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది.కాగా ఆదివారం ఉదయం 10.23 గంటలకు పీఎస్ఎల్వీ ద్వారా ఈ ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపిందట.

 Isro-launches-pslv-c51-rocket-into-orbit Pslv C 51 Rocket, Successfully, Launche-TeluguStop.com

ఇకపోతే పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇది 53 వ ప్రయోగంగా పేర్కొంటున్నారు అధికారులు.

కాగా ఈ రాకెట్ ద్వారా మొత్తం 19 ఉపగ్రహాలను నింగిలో ప్రవేశపెట్టారు.ఇందులో 5 ప్రైవేట్ ఉపగ్రహాలు కాగా, 14 దేశీయ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టారు.ఇక నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లాంచింగ్ ప్యాడ్-1 నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ కౌంట్‌డౌన్ నిన్న ఉదయం 8.54 గంటలకు ప్రారంభమయ్యిందట.

అలా 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది.ఇక నాలుగు దశల్లో ఆ ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ఉంచారు.కాగా ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఈ ప్రయోగం విజయవంతం అవడంతో శాస్త్రవేత్తలు తమ సంతోషం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube