కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన ఇస్రో..ఆ రికార్డు ఏమిటంటే..?

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో( ISRO ) వరసగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

చంద్రుని దక్షిణ ధ్రువం పై చంద్రయాన్-3 ల్యాండర్ ను దించిన తొలి దేశంగా చరిత్ర సృష్టించిన ఇస్రో సంస్థ తాజాగా భారత క్రికెట్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసింది.

చంద్రుని దక్షిణ ధ్రువం పై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా సాప్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత ఇస్రో సంస్థ ఒక ట్వీట్ చేసింది.ఆ ట్వీట్ చంద్రయాన్-3( Chandrayaan-3 ) చేసినట్లుగానే ఉంది.

ఆ ట్వీట్ లో నేను నా లక్ష్యాన్ని చేరుకున్నాను.మీరు కూడా.చంద్రయాన్-3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండింగ్ అయింది కంగ్రాట్స్ ఇండియా అని ట్వీట్ లో ఉంది.ఈ ట్వీట్ నెటిజన్లను చాలా బాగా ఆకర్షించింది.ఏకంగా ఈ ట్వీట్ ను 56 మిలియన్ల మంది వీక్షించారు.8.50 లక్షల మంది లైక్ కొట్టారు.

భారతదేశంలో ఇదే అత్యధిక లైకులు కావడం విశేషం.గతంలో ఈ రికార్డ్ క్రికెట్ ఆటగాడైన విరాట్ కోహ్లీ( Virat Kohli) పేరిట ఉండేది.2022 లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై సంచలన ఇన్నింగ్స్ ఆడి భారత్ ను గెలిపించిన అనంతరం కోహ్లీ ఒక ట్వీట్ చేశాడు.ఆ ట్వీట్ కు 7.96 లక్షల మంది లైక్ కొట్టారు.ఇప్పటివరకు ఈ రికార్డును ఎవరు ఎవరు బ్రేక్ చేయలేకపోయారు.

Advertisement

కానీ తాజాగా ఇస్రో.విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టింది.చంద్రయాన్-3 సక్సెస్ అయిన అనంతరం సోషల్ మీడియా వేదికగా ఇస్రోపై భారతీయులతో పాటు విదేశీయులు కూడా ప్రశంసల జల్లు కురిపించారు.

చంద్రుడిపై దిగిన చంద్రయాన్-3 రోవర్ ప్రయోగాలను కొనసాగిస్తోంది.విక్రమ్ ల్యాండర్ లోని పేలోడ్ చంద్రుడి ఉపరితలం తో పాటు కాస్త లోతులో సేకరించిన శాంపిల్ ఉష్ణోగ్రతల లెక్కలను ఒక గ్రాఫ్ రూపంలో తెలిపింది.దానికి ఉండే 10 సెన్సార్ల సహాయంతో చంద్రుడి నేలపై దాదాపు పది సెంటీమీటర్ల లోతు వరకు చొచ్చుకెళ్లి టెంపరేచర్ లను లెక్కించే సామర్థ్యం ఈ పేలోడుకు ఉంది.

చంద్రుని ఉపరితలంపై 50 నుండి 60 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉన్నట్లు తెలిపింది.

వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..
Advertisement

తాజా వార్తలు