64 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల అందం.. ఎలా అంటే?

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ మన చర్మంలో మార్పులు రావడం సహజమే.వయసు పెరిగే కొద్దీ చర్మం పై ముడతలు ఏర్పడి వృద్ధాప్యం సంతరించుకుంటుంది.

 Tel Aviv University,israeli Scientists,reverse Ageing,telomer‌ Gloves,cellular-TeluguStop.com

కానీ కొందరు యవ్వనంగా కనిపించడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.చర్మంపై ఏర్పడ్డ ముడతలు తొలగిపోవడానికి సర్జరీలు కూడా చేయించుకుంటున్నారు.

మనిషి పుట్టుక, యవ్వనం, వృద్ధాప్యం ఇవన్నీ కూడా కాల చక్రంలో ఒక భాగమే.వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేసే వారికి ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు ఒక శుభవార్త చెప్పారు.64 సంవత్సరాలు వయసు ఉన్న వృద్ధులు కూడా పాతికేళ్ల నవ యవ్వనంగా ఉండొచ్చని ఈ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో వెల్లడించారు…

టెల్‌ అవివ్‌ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన తాజా పరిశోధనలో ఈ విషయం వెల్లడించడంతో మొత్తం ప్రపంచం దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు.ఈ పరిశోధనలో భాగంగా 64 సంవత్సరాల వయసున్న 26 మందిని మూడు నెలల పాటు ప్రెషరైజ్డ్‌ ఆక్సిజన్‌ చాంబర్‌‌లలో ఉంచి వారంలో ఐదు రోజుల పాటు రోజుకు గంటన్నర చొప్పున మాస్కులు ద్వారా స్వచ్ఛమైన గాలిని వారికి అందించారు.

సాధారణంగా మానవ శరీరంలో 23 జతల క్రోమోజోములు ఉంటాయన్న సంగతి తెలిసిందే.ఈ క్రోమోజోముల వల్ల జన్యుపరమైన లక్షణాలు ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపిస్తాయి.

అయితే ఈ క్రోమోజోముల పరిణామం క్షీణించకుండా వాటి చివరమూతల్లా ఉండే ‘టెలోమెర్‌’ తొడుగులు ఉంటాయి.సాధారణంగా వయసు పెరిగే కొద్దీ ఈ టెలోమేర్ పరిమాణం తగ్గడం వల్ల వృద్ధాప్యం కనిపిస్తుంది.

మనిషి పుట్టినప్పుడు దాదాపు 11 కిలో బేస్ లు ఉండే టెలోమేర్ పొడవు వృద్ధాప్య సమయానికి దాదాపు నాలుగు కిలో బేస్ లకు కుచించుకుపోతుంది.అయితే మూడు నెలల పరిశోధనలో భాగంగా పరిశోధనలో పాల్గొన్న 26 మంది వృద్ధులు ప్రతిరోజు స్వచ్ఛమైన గాలిని తీసుకోవడం ద్వారా టెలోమేర్ లు 20 శాతం పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ టెలోమేర్ లు పెరగడం వల్ల వయసు ఎక్కువగా ఉన్నప్పటికీ యవ్వనంగా కనిపించే ఆస్కారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube