మేమున్నాం.. మీ బాధ్యత మాదే: సౌమ్యా సంతోష్ కుటుంబానికి ఇజ్రాయెల్ అధినేత భరోసా

ఇజ్రాయెల్- పాలస్తీనాల మధ్య జరుగుతున్న యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని అష్కెలాన్‌ నగరంపై హమాస్‌ చేసిన దాడిలో భారత్‌లోని కేరళకు చెందిన సౌమ్యా సంతోష్‌ మరణించారు.

 Israels President Reuven Rivlin Speaks To Family Of Indian Caregiver Sowmya Sant-TeluguStop.com

భర్తతో వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో హమాస్ ప్రయోగించిన రాకెట్ ఆమె నివసిస్తున్న ఇంటిలోకి దూసుకొచ్చి, క్షణాల్లో ఇల్లు నేలమట్టమైంది.ఈ ఘటనలో సౌమ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

దీనిపై ఇజ్రాయెల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.ఈ క్రమంలో సౌమ్య కుటుంబసభ్యులను స్వయంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు రెవెన్‌ రివ్లిన్‌ పరామర్శించారు.

బుధవారం ఆయన కేరళలలోని సౌమ్య కుటుంబానికి ఫోన్‌ చేసి.ఆమె మృతికి సంతాపం తెలిపారు.

ఇప్పటికే భారత్‌లో ఉన్న ఇజ్రాయెల్‌ రాయబారి రోన్‌ మల్కా.సౌమ్య కుటుంబాన్ని ఫోన్‌ చేసి ఓదార్చిన సంగతి తెలిసిందే.ఆమె మృతికి ఇజ్రాయెల్‌ బాధపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇక ఇజ్రాయెల్‌ డిప్యూటీ రాయబారి రోని యెడిడియ ట్వీట్‌ చేస్తూ.

సౌమ్య మృతికి పరిహారం ఇవ్వడంతోపాటు ఆమె కుటుంబ బాధ్యతలను ఇజ్రయెల్‌ అధికారులు స్వీకరిస్తారని హామీ ఇచ్చారు.ఆమె మృతదేహాన్ని శనివారం సౌమ్య స్వగ్రామం కేరళలోని ఇడుక్కికి తీసుకొచ్చి.

అక్కడి ఒక చర్చిలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

మరోవైపు ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో వున్న భారత సంతతి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

స్థానిక బెన్ గురియన్ యూనివర్సిటీలో పలువురు భారత పరిశోధకులు చిక్కుకుపోయారు.గాజా నుంచి దూసుకువస్తున్న రాకెట్ల నుంచి కాపాడుకునేందుకు సరైన రక్షణ లేక వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.

ఈ క్రమంలో యూనివర్సిటీ పక్కనే ఉన్న బీర్షెబా క్రికెట్ క్లబ్ భారత పరిశోధకులకు ఆశ్రయం కల్పించింది.నెగెవ్ దక్షిణ ప్రాంతంలోని ఈ క్రికెట్ క్లబ్ కు చెందిన రెండంతస్తుల భవనంలో భూగర్భంలో తలదాచుకునే సౌకర్యం ఉంది.

భారత పరిశోధకులు యూనివర్సిటీలో చిక్కుకుపోయారని తెలియడంతో క్రికెట్ క్లబ్ వెంటనే స్పందించింది.

మరోవైపు తమ భూభాగాన్ని పరిరక్షించుకునేందుకు ఇజ్రాయెల్ తీసుకునే చర్యలను సమర్థిస్తామంటూనే కాల్పుల విరమణ ప్రతిపాదనకు మద్దతిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.

ఈ విషయంపై ఆయన ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసి మాట్లాడారు.గాజాలోని హమాస్ ఉగ్రవాదుల స్థావరాలపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను పరోక్షంగా బైడెన్ సమర్థించారు.

అయితే.ఈ దాడుల్లో సామాన్య పౌరులు మరణించడంపై అమెరికా అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube