ఆమె ఇక తమలో ఒకరు: కేరళ నర్స్‌ సౌమ్య సంతోష్‌‌కు ఇజ్రాయెల్ అరుదైన గౌరవం

పాలస్తీనా రాకెట్ దాడుల్లో మరణించిన భారతీయ నర్స్ సౌమ్య సంతోష్‌కు ఇజ్రాయెల్ అరుదైన గౌరవం కల్పించింది.ఆమెకు తమ దేశ గౌరవ పౌరసత్వం కల్పిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది.

 Israel To Bestow Honorary Citizenship On Soumya Santhosh, Soumya, Santhosh, Isra-TeluguStop.com

సౌమ్యను తమ దేశ పౌరురాలుగా ఇజ్రాయెల్ ప్రజలు భావిస్తున్నారని, ఆమెను తమలో ఒకరిగా చూసుకోవాలనుకుంటున్నారని భారత్‌లో ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారి రోరీ యెడీడియా స్పష్టం చేశారు.ఇజ్రాయెల్ ప్రభుత్వ నిర్ణయాన్ని సౌమ్య సంతోష్ కుటుంబ సభ్యులు స్వాగతించారు.

ఇది తన భార్యకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తామని ఆమె భర్త సంతోష్ తెలిపారు.ఈ విషయంపై ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం అధికారులు సమాచారం అందించారని, తమ కుమారుడు అడోన్ బాధ్యతలను కూడా ఇజ్రాయెల్ స్వీకరిస్తుందని వారు భరోసా ఇచ్చారని సంతోష్ వివరించారు.

సౌమ్య మరదలు షెర్లీ బెన్నీ కూడా ఇజ్రాయెల్ లోనే పనిచేస్తున్నారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, సౌమ్యను ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పుడు ఓ దేవతగా భావిస్తున్నారని తెలిపారు.

విదేశాల్లో మరణించిన ఓ భారత జాతీయురాలికి లభించిన గొప్పగౌరవం ఇదని షెర్లీ హర్షం వ్యక్తం చేశారు.

భారత్‌లోని కేరళకు చెందిన సౌమ్య సంతోష్ పాలస్తీనా బలగాలు చేసిన రాకెట్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

కేరళలో ఉన్న భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగా.పాలస్తీనా దళాలు రాకెట్ దాడి చేశాయి.

వాటిలో ఒక రాకెట్ సౌమ్య ఇంటిపై పడటంతో ఇళ్లు నేలమట్టమై ఆమె మరణించారు.ఆమె మృతదేహాన్ని సౌమ్య స్వగ్రామం ఇడుక్కికి తీసుకెళ్లి.

అక్కడి ఒక చర్చిలో అంత్యక్రియలు నిర్వహించారు.ఈ క్రమంలో సౌమ్య కుటుంబసభ్యులను స్వయంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు రెవెన్‌ రివ్లిన్‌ పరామర్శించారు.

ఆయన కేరళలోని సౌమ్య కుటుంబానికి ఫోన్‌ చేసి.ఆమె మృతికి సంతాపం తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube