ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో 15000 దాటిన మరణాలు..!!

ఇజ్రాయెల్.గాజా మధ్య యుద్ధం మొదలై రెండు నెలలు కావస్తోంది.అక్టోబర్ 7వ తారీకు హమాస్ మిలిటెంట్ లు.( Hamas ) ఇజ్రాయెల్( Israel ) భూభాగంలో అక్రమంగా చొరబడి పౌరులపై… సైనికులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి రక్తపాతం సృష్టించారు.ఇజ్రాయెల్ పౌరులను 200 మందికి పైగా బందీలుగా అపహరించడం తెలిసిందే.దీంతో ఇజ్రాయెల్ సైనిక దళాలు.గాజా పట్టణం పై( Gaza ) విరుచుకుపడుతూ ఉన్నాయి.అక్కడ ఉన్న హమాస్ మిలిటెంట్ స్థావరాలపై బాంబులతో దాడులు చేస్తూన్నారు.

 Israel Hamas War Deaths Over Fifteen Thousand Details, Israel Hamas War, Israel,-TeluguStop.com

కాగా ఇటీవల కాల్పుల విరమణ అంగీకారంతో కొంతమంది బందీలను హమాస్ విడుదల చేయడం జరిగింది.

దీంతో మొన్నటి వరకు మూడు రోజులు పాటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్( IDF ) గాజా పై ఎటువంటి దాడులు చేయలేదు.ఇటీవల ఇరు పక్షాల మధ్య కాల్పుల విరమణ ముగియటంతో మళ్లీ యుద్ధం మొదలయ్యింది.ఈ క్రమంలో దాదాపు 15,200 మందికి పైగా మరణించినట్లు స్థానిక ఆరోగ్య విభాగం స్పష్టం చేసింది.మృతులలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పేర్కొంది.అంతేకాదు సుమారు 40000 మందికి పైగా గాయపడినట్లు తెలిపింది.

మరణాల సంఖ్య ఉండే కొద్ది పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేయడం జరిగింది.దాదాపు రెండు నెలల నుండి జరుగుతున్న ఈ యుద్ధం మిడిల్ ఈస్ట్ లో( Middle East ) భయంకర వాతావరణం సృష్టిస్తుంది.ఒకపక్క ఇజ్రాయెల్. మరోపక్క హమాస్ రెండు వెనక్కి తగ్గటం లేదు.ఈ క్రమంలో అగ్రరాజ్యాలైన అమెరికా ఇంకా పలు దేశాలు సైతం.శాంతిని నెలకొల్పటానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదు.ఇజ్రాయెల్… హమాస్ యుద్ధం( Israel Hamas War ) తీవ్రతరమైతే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube