రాకెట్లతో విరుచుకుపడుతున్న ఉగ్రవాదులకు దీటైన జవాబు ఇస్తున్న ఇజ్రాయెల్..!!

గత కొద్ది నెలల నుండి ఇజ్రాయెల్- పాలస్తీనా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.ఇజ్రాయెల్ రాజధాని జెరుసలేము లో భారీగా అరబ్ ప్రజలు గొడవకు దిగారు.

 Israel Defence Super Counters To Terrorists Israel, Benjamin, Nathanyahu,palisth-TeluguStop.com

జెరుసలేము లో ఉండే టెంపుల్ మౌంట్ వద్ద అరబ్బు ప్రజలు రంజాన్ మాసంలో ప్రార్థనలకు దిగిన సమయంలో గొడవ చోటుచేసుకోవడంతో ఇజ్రాయెల్ పోలీసులకు మరియు అరబ్ ప్రాంత ప్రజలకు మధ్యాహ్న సమయంలో తోపులాట జరిగింది.ఆ గొడవ పెద్దది కావడంతో అదే సమయంలో గాజా నుండి హమాస్ ఉగ్రవాదులు భారీగా రాకెట్లు ఇజ్రాయెల్ పౌరులు నివసించే నివాసాలు పై ప్రయోగిస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో కొంతమంది ఇజ్రాయెల్ ప్రాంతానికి చెందిన ప్రజలు గాయపడగా ఇండియా దేశానికి చెందిన ఒక అమ్మాయి అక్కడ ఆయాగా పని చేస్తూ ఉండగా జరిగిన రాకెట్ల దాడి లో నిన్న మరణించడం జరిగింది.ఈ ఘటన తో రియాక్ట్ అయిన బెంజమిన్ నెతన్యాహు నిన్నమీడియా సమావేశం నిర్వహించి జరుగుతున్న దాడులను ఉద్దేశించి ఇజ్రాయిల్ సమాధానం కూడా చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

వెంటనే ఎక్కడినుండి అయితే ఇజ్రాయెల్ ప్రాంతంపై రాకెట్లు వస్తున్నాయో అక్కడ ఇజ్రాయెల్ డిఫెన్స్ బలగాలు రంగంలోకి దిగి ఉగ్రవాదులకు గట్టి సమాధానం ఇచ్చాయి.Telugu Athanyahu, Banjiman, Defenc, Ijrail, Israel, Palisthina-Latest News - Tel

తాజాగా ఇజ్రాయెల్ గాజా ప్రాంతంలో చేసిన దాడులలో 13 అంతస్థుల బిల్డింగ్ కుప్పకూలిపోయింది.ఆ భవనంలో నుండే భారీగా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ నివసిస్తున్న ఇళ్లపై దాడులు చేసినట్లు స్పష్టమైన సమాచారం రావడంతో ఇజ్రాయేల్ డిఫెన్స్ బలగాలు ఒకే ఒక్క బాంబుతో ఆ బిల్డింగ్ ని నిర్వీర్యం చేసాయి.దాదాపు 80 యుద్ధ విమానాలను ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలలో డిఫెన్స్ బలగాలు రంగంలోకి దించి రెడీగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఇజ్రాయిల్- పాలస్తీనా దేశాల మధ్య తాజాగా జరుగుతున్న రాకెట్ల యుద్ధం పై అంతర్జాతీయ దేశాలు.రెండు దేశాలు సామరస్యంగా మెలగాలని యుద్ధం వైపు అడుగులు వేసే రీతిలో ఎవరు నిర్ణయాలు తీసుకోకూడదని అంటున్నాయి.

ఏదిఏమైనా ఇజ్రాయెల్ తమ దేశ పౌరులపై ఉగ్రవాదులు చేస్తున్న దాడులకు ప్రతి దాడులు గట్టిగానే ఇస్తూ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube