ఇస్మార్ట్‌గా సెంచరీ కొట్టాడుగా!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన రీసెంట్ మూవీ ఇస్మార్ట్ శంకర్.దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో రామ్‌లకు ఈ సినిమా చాలా ప్రెస్టీజియస్‌గా మారిన విషయం మనకు తెలిసిందే.

 Ismartshankar Completes 100 Daysrun-TeluguStop.com

ఈ సినిమాతో ఇద్దరూ హిట్ కాట్టాలనే కసితో పనిచేశారు.కాగా ఈ సినిమా రిలీజ్ రోజునే హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో సినిమా థియేట్రికల్ రన్‌లో మంచి వసూళ్లు సాధించింది.

రామ్ యాక్టింగ్, పూరీ క్రేజ్, నిధి అగర్వాల్ – నభా నటేష్‌ల అందాలు కలగలిసి సినిమాకు మంచి విజయాన్ని అందించాయి.రామ్ తెలంగాణ యాసతో చేసిన డైలాగ్ డెలివరీ యూత్‌కు బాగా కనెక్ట్ కావడంతో పాటు సినిమా పాటలు కూడా బాగుండటంతో సినిమా విజయం సాధించింది.

హీరో రామ్, దర్శకుడు పూరీలకు వారు ఎంతగానో వేచి చూస్తున్న విజయాన్ని అందించాయి.అటు పూరీతో కలిసి నిర్మాతగా మారిన చార్మీకి కూడా సక్సె్స్‌ను తెచ్చిపెట్టింది.

Telugu Charmee Kaur, Ismart Shankar, Nidhie Aggarwal, Puri Jagannadh, Ram Pothin

ఇక ఈ సినిమా తాజాగా ఓ అరుదైన ఫీట్ సాధించింది.ఈ మధ్యకాలంలో 100 రోజులు ఆడిన సినిమాలు వేళ్లపై లెక్కించవచ్చు.కానీ తాజాగా ఇస్మార్ట్ శంకర్ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది.మంచి కామెడీ, పాటలతో కూడిన మాస్ మసాలా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని ఇస్మార్ట్ శంకర్ మరోసారి ప్రూవ్ చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube