ఈవారం కూడా ఇస్మార్ట్‌ జోరుకు అడ్డు పడలేదు  

Ismart Shanker Runing In Successfull-

రామ్‌ హీరోగా పూరి దర్శకత్వంలో తెరకెక్కి రెండు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు లక్‌ కలిసి వచ్చిది.సినిమాకు ఒక మోస్తరుగా ఉంది అనే టాక్‌ వచ్చినప్పటికి మంచి వసూళ్లను నమోదు చేస్తోంది.ఈ చిత్రంకు పోటీగా వచ్చిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.

Ismart Shanker Runing In Successfull--Ismart Shanker Runing In Successfull-

ఆ తర్వాత వారం వచ్చిన డియర్‌ కామ్రేడ్‌ చిత్రం ఖచ్చితంగా ఈ చిత్రంకు గట్టి పోటీ ఇచ్చి కలెక్షన్స్‌ను తగ్గిస్తుందనుకుంటే విజయ్‌ దేవరకొండ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాడు.

Ismart Shanker Runing In Successfull--Ismart Shanker Runing In Successfull-

డియర్‌ కామ్రేడ్‌ ఆడక పోవడంతో రెండవ వారంలో కూడా ఇస్మార్ట్‌ శంకర్‌ హవా కొనసాగింది.రెండు వారాల్లో 70 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ను రాబట్టిన ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రం ఇప్పుడు మూడవ వారంలోకి అడుగు పెట్టింది.నిన్న పలు చిత్రాలు విడుదల అయ్యాయి.అందులో ఏదో ఒకటి సక్సెస్‌ అయినా కూడా ఇస్మార్ట్‌ శంకర్‌ జోరుగా ఆగేది.

కాని నిన్న విడుదలైన అన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.దాంతో ఇస్మార్ట్‌ శంకర్‌ జోరు కంటిన్యూ అవుతోంది.

ఈ వారం కూడా నిలకడగా కలెక్షన్స్‌ ఉండే అవకావం ఉందని, తద్వారా ఈ చిత్రం ఫుల్‌ రన్‌ గ్రాస్‌ కలెక్షన్స్‌ 80 నుండి 85 వరకు చేరుకుంటుందనే టాక్‌ వినిపిస్తుంది.ఒక యావరేజ్‌ టాక్‌ సినిమా ఇంత భారీ వసూళ్లను నమోదు చేయడం అంటే మామూలు విషయం కాదు.

ఇంత భారీ వసూళ్లకు ప్రధాన కారణం సినిమాకు వేరే సినిమాల నుండి పోటీ లేకపోవడమే అని అర్థం చేసుకోవచ్చు.భారీ స్థాయిలో అంచనలున్న పూరి ఇస్మార్ట్‌ శంకర్‌ ఆశించిన స్థాయికి చాలా ఎక్కువ వసూళ్లను నమోదు చేయడంతో ప్రస్తుతం పూరి మరియు రామ్‌లు చాలా హ్యాపీగా ఉన్నారు.