ఇస్మార్ట్‌ సక్సెస్‌ అయ్యిందా, అప్పుడే సీక్వెల్‌ అంటున్నారు  

Ismart Shankar Sequel Plans Puri Jagannath-

రామ్‌ హీరోగా నభా నటేష్‌ మరియు నిధి అగర్వాల్‌లు జంటగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రూపొందిన ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుంది, కలెక్షన్స్‌ ఏ స్థాయిలో రాబట్టబోతుంది అనేది ఆదివారం తర్వాత వెళ్లడయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతానికి సినిమాకు పర్వాలేదు అన్నట్లుగా టాక్‌ వచ్చింది.కొందరు రివ్యూవర్స్‌ ఏం సినిమారా బాబు అంటున్నా కొందరు మాత్రం పూరి మార్క్‌లో బాగానే ఉంది అంటున్నారు.

Ismart Shankar Sequel Plans Puri Jagannath--Ismart Shankar Sequel Plans Puri Jagannath-

Ismart Shankar Sequel Plans Puri Jagannath--Ismart Shankar Sequel Plans Puri Jagannath-

ఇక ఈ చిత్రం కోసం మొదటి నుండి చాలా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న రామ్‌ గోపాల్‌ వర్మ సినిమా చూసి సూపర్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నాడు.తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను నమోదు చేయడం ఖాయం అంటూ ఆశాజనకంగా ఉన్నారు.ఇక ఈ చిత్రం గురించి రామ్‌ గోపాల్‌ వర్మ స్పందిస్తూ చిత్ర యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వెంటనే ఈ సినిమాకు సీక్వెల్‌ తీయాలంటూ సూచించాడు.

రామ్‌ గోపాల్‌ వర్మ ట్వీట్‌కు పూరి సమాధానం చెబుతూ సర్‌ సీక్వెల్‌ కోసం ‘డబుల్‌ ఇస్మార్ట్‌ శంకర్‌’ టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేసినట్లుగా చెప్పడం జరిగింది.సీక్వెల్‌ పక్కా అంటూ పూరి దీంతో ఫుల్‌ క్లారిటీ ఇచ్చాడు.ఇప్పుడు వెంటనే కాకున్నా కాస్త టైం తీసుకుని ఇస్మార్ట్‌ శంకర్‌కు డబుల్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ అంటూ సీక్వెల్‌ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.మరి ఈ ఇస్మార్ట్‌ శంకర్‌ ఫలితం తేలకుండానే దర్శకుడు డబుల్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ను ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది అంటూ సినీ వర్గాల వారు ముక్కున వేలేసుకుంటున్నారు.