అటు రామ్.. ఇటు పూరీకి కీలకంగా మారిన ఇస్మార్ట్ శంకర్! ట్రాక్ ఎక్కుతారో లేదో  

Ismart Shankar Movie Want To Success With Ram And Puri Jagannath -

టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరో రామ్.దశాబ్దం క్రితమే హీరోగా కెరియర్ స్టార్ట్ చేసిన రామ్ ఇప్పటికి తనకంటూ మార్కెట్ తెచ్చుకోలేక తంటాలు పడుతూనే ఉన్నాడు.

Ismart Shankar Movie Want To Success With Ram And Puri Jagannath

అతని కెరియర్ లో రెడీ తర్వాత ఆ స్థాయిలో బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పటి వరకు రాలేదనే చెప్పాలి.రొటీన్ ఫార్ములాతో ఒకే తరహా కథలు చేస్తూ వెళ్తున్న రామ్ ఎనర్జీకి తగ్గ సినిమా ఇప్పటి వరకు పడలేదనే చెప్పాలి.

ఈ కారణంగా అతనికంటే లేట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన నాని, విజయ్ దేవరకొండ స్టార్ హీరోలుగా మారిపోయారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్, కమర్షియల్ దర్శకుడు పూరీతో జత కట్టాడు.

టాలీవుడ్ కి హీరోయిక్ సినిమాలని పరిచయం చేసిన పూరీ ఈ మధ్య సరైన హిట్ లేక కంటెంట్ లో బలం లేక క్రిందకి పడిపోయాడు.ఇలాంటి టైంలో వీరిద్దరి కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ సినిమా, కాస్తా డిఫరెంట్ కంటెంట్ రావడం కాస్తా ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ సినిమా అటు హీరోకి, ఇటు దర్శకుడుకి చాలా కీలకంగా ఉంది.సినిమా హిట్ అయితే ఇద్దరు ఒకేసారి బౌన్స్ బ్యాక్ అవుతారు.ఒకవేళ కాకుంటే పూరీ కెరియర్ ముగిసిపోయినట్లే అని అందరూ భావిస్తారు.ఇక రామ్ తనకి అలవాటైన సినిమాలు చేసుకుంటూ ఎవరేజ్ హీరోగా నిలిచిపోతాడు.

మరి ఇస్మార్ట్ శంకర్ వీరి భవిష్యత్తు ఎలా డిసైడ్ చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ismart Shankar Movie Want To Success With Ram And Puri Jagannath- Related....