ఇస్మార్ట్‌ కలెక్షన్స్‌ కుమ్మేస్తున్నాయి  

Ismart Shankar Movie Box Office Collections-hero Ram,ismart Shankar Box Office,ismart Shankar Collections

రామ్‌ హీరోగా పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు మిశ్రమ స్పందన దక్కించుకుంది. దాంతో కలెక్షన్స్‌ ఎలా ఉంటాయో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మొదటి రోజు 7 కోట్ల షేర్‌ రాబట్టడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈ కలెక్షన్స్‌ మొదటి రోజే అనుకున్నారు..

ఇస్మార్ట్‌ కలెక్షన్స్‌ కుమ్మేస్తున్నాయి-ISmart Shankar Movie Box Office Collections

కాని రెండవ రోజు కూడా భారీ వసూళ్లను నమోదు చేసింది.

మొదటి రెండు రోజుల్లో ఏకంగా 25 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఇక మూడవ రోజు కూడా కలెక్షన్స్‌ బాగానే ఉన్నాయి. 32.5 కోట్లకు ఇస్మార్ట్‌ కలెక్షన్స్‌ చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రపంచం మొత్తంగా ఈ చిత్రం 16.5 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. ఈ దూకుడు చూస్తుంటే మొదటి నాలుగు రోజుల్లోనే బయ్యర్ల పెట్టుబడి వచ్చేసి నిర్మాతకు లాభాల పంట పండించడం ఖాయంగా కనిపిస్తుంది.

గురువారం విడుదలైన ఈ చిత్రం ఆదివారంకు 40 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఇక పెద్ద సినిమాలు పోటీకి ఏమీ లేని కారణంగా లాంగ్‌ రన్‌లో కనీసం 60 కోట్ల వరకు లాగే అవకాశం ఉంది. అంటే షేర్‌ను చూస్తే దాదాపుగా 35 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి ఇస్మార్ట్‌ శంకర్‌ కలెక్షన్స్‌ దుమ్ము రేపే విధంగా వస్తుండటంతో పూరి ఈజ్‌ బ్యాక్‌ అంటూ అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.