పబ్లిక్‌ టాక్‌ : ఇస్మార్ట్‌ సత్తి అయిన బిత్తిరి సత్తి ఎలా ఉన్నాడు  

Ismart Sathi Public Talk-ismart Sathi,new Movie,tollywood,v6 Channel

బిత్తిరి సత్తి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.వి6 ఛానెల్‌ ద్వారా పరిచయం అయిన బిత్తిరి సత్తి అలియాస్‌ చేవెళ్ల రవి ప్రస్తుతం కొత్త జర్నీని ప్రారంభించాడు.చేవెళ్ల రవి తాజాగా టీవీ9లో జాయిన్‌ అయిన విషయం తెల్సిందే.నెల రోజుల క్రితమే టీవీ9లో జాయిన్‌ అయిన రవి నిన్నటి నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.టీవీ9లో ఇస్మార్త్‌ సత్తి అనే కార్యక్రమంతో సందడి చేసేందుకు సిద్దం అయ్యాడు.వినాయక చవితి సందర్బంగా ఇస్మార్ట్‌ సత్తి కార్యక్రమం ప్రారంభం అయ్యింది.

Ismart Sathi Public Talk-ismart Sathi,new Movie,tollywood,v6 Channel-Ismart Sathi Public Talk-Ismart New Movie Tollywood V6 Channel

Ismart Sathi Public Talk-ismart Sathi,new Movie,tollywood,v6 Channel-Ismart Sathi Public Talk-Ismart New Movie Tollywood V6 Channel

ఇస్మార్ట్‌ సత్తి కార్యక్రమం మొదటి రోజు తీవ్రంగా నిరాశ పర్చింది.రవి బాడీలాంగ్వేజ్‌ మరియు యాస మొత్తం మారిపోయింది.రవి గతంలో తీన్మార్‌ స్థాయిలో ప్రేక్షకులను అలరించడం అంటే దాదాపు అసాధ్యం అని మొదటి నుండి ప్రచారం జరుగుతోంది.అయితే గతంలో ఎంటర్‌టైన్‌ చేసిన దాంట్లో కనీసం సగం అయినా ఎంటర్‌టైన్‌ చేసే అవకాశం అయితే కనిపించడం లేదు.

ఇస్మార్ట్‌ సత్తి ప్రతి రోజు కూడా వచ్చి ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంతో టీవీ 9 యాజమాన్యం ఉంది.

నిన్న ఇంట్రో కాబట్టి కాస్త సందడి అనిపించలేదు.కాని నేటి నుండి అసలు కార్యక్రమం ఉంటుంది.గతంలో మాదిరిగానే న్యూస్‌ బులిటిన్‌లో ఒక అయిదు నుండి పది నిమిషాల వరకు ఉంటుంది.అంతే తప్ప ఎక్కువ సమయం ఉండటం లేదని అంటున్నారు.మరీ ఎక్కువ సమయం ఉన్నా కూడా బోర్‌ కొట్టించే అవకాశం ఉంది.అందుకే బిత్తిరి సత్తి కాస్త ఇస్మార్ట్‌ సత్తిగా మారి ప్రతి రోజు అయిదు నిమిషాల పాటు ఎంటర్‌టైన్‌ చేయబోతున్నాడు.

నేటి ఎపిసోడ్‌తో ఇస్మార్ట్‌ సత్తి ఏ స్థాయిలో ఎంటర్‌టైన్‌ చేస్తాడో క్లారిటీ వచ్చేసే అవకాశం ఉంది.మొదటి ఎపిసోడ్‌తో అయితే పబ్లిక్‌ నిరాశ చెందారు.ఇస్మార్ట్‌ న్యూస్‌ అంటూ మరీ సోది పెట్టారని, నారధ అంటూ ఏదో స్కిట్‌ చేసేందుకు ప్రయత్నించి అబ్బే అనిపించారు.

మొత్తానికి ఇస్మార్ట్‌ న్యూస్‌ టీవీ9 స్థాయిని పెంచుతాయా లేదా తగ్గిస్తాయా అనేది చూడాలి.