ఆ హీరోతో ప్రేమలో పడ్డానంటున్న ఇస్మార్ట్ బ్యూటీ..?  

సుధీర్ బాబుకు జోడీగా నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్.అందం, అభినయం పుష్కలంగా ఉన్న నభా నటేష్ కు ఆ సినిమాతో నటిగా మంచిపేరే వచ్చినా సినిమా ఫ్లాప్ కావడంతో అవకాశాలు రాలేదు.

TeluguStop.com - Ismart Beauty Nabha Natesh Says Sharuk Khan Her Favoruite Hero

ఆ సినిమా తరువాత పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నభానటేష్ రామ్ కు జోడీగా నటించింది.సినిమాలో పాత్ర నిడివి తక్కువే అయినా గ్లామర్ తో నభా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లను పెంచుకుంటున్న నభా తాజాగా పెళ్లైన హీరోతో ప్రేమలో పడ్డానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ తో తాను ప్రేమలో పడ్డానని సినిమాల్లోకి రాకముందు నుంచి షారుఖ్ ఖాన్ అంటే ఎంతో ఇష్టమని నభా తెలిపింది.

TeluguStop.com - ఆ హీరోతో ప్రేమలో పడ్డానంటున్న ఇస్మార్ట్ బ్యూటీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రతి ఒక్కరూ చదువుకునే సమయంలో హీరోహీరోయిన్లను అభిమానిస్తారని అలా తనకు కూడా షారూక్ ఖాన్ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమని నభా వెల్లడించింది.

Telugu Crush On Sharukh Khan, Ismart Beauty Nabha Natesh, Kuch Kuch Hota Hai, Solo Bratuke So Better-Movie

షారుక్ నటించిన సినిమాల్లో కుచ్ కుచ్ హోతా హై సినిమాను ఎన్నిసార్లు చూసినా తనకు మళ్లీమళ్లీ చూడాలనిపిస్తుందని ఆ సినిమా తనకు అంతలా నచ్చిందని నభా తెలిపింది.అలా తన ఫేవరెట్ హీరో షారుక్ ఖాన్ అని నభా నటేష్ చెప్పకనే చెప్పేసింది.మరోవైపు ఈ సంవత్సరం నభా నటించిన డిస్కో రాజా సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది.

అయితే ఇస్మార్ట్ శంకర్ తప్ప మరే హిట్టు లేకపోయినా నభా నటేష్ కు ఆఫర్లకు మాత్రం కొదువ లేదు.

వరుసగా కొత్త సినిమాలకు కమిటవుతూ మిడిల్ రేంజ్ హీరోయిన్లలో బిజీ హీరోయిన్ గా నభా నటేష్ గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం నభా నటేష్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ సరసన అల్లుడు అదుర్స్ సినిమాలో నటిస్తోంది.ఈ సినిమాలతో పాటు నితిన్ హీరోగా తెరకెక్కనున్న అంధాదూన్ రీమేక్ లో నభానే హీరోయిన్ గా ఎంపికైంది.

నభా ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు హిట్టైతే మాత్రం త్వరలోనే ఆమె స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోవడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

#CrushOn #IsmartBeauty #SoloBratuke

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు