ఆమె ఫోన్ పోగొట్టుకుంది.. ఆ ఫోన్ ఓపెన్ చేసి చూస్తే అన్ని అలాంటివే!

జర్మనీలో ఈవెంట్ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న ఒమామియా అబిడి అనే మహిళ పొరబాటున తన ఫోన్ పారేసుకుంది.ఆ ఫోన్ వేరొక వ్యక్తికి దొరికింది.

 Isis Womenarrested With Her Missing Phone-TeluguStop.com

అతను న్యాయంగా ఫోన్ తిరిగి ఇచ్చేద్దామని ప్రయత్నం చేసాడు.తెలిసిన వారి ఫోన్ నెంబర్లకోసం ఆ ఫోన్ ఆన్ చేశాడు.

నెంబర్లేవీ లభించకపోవడంతో దాన్ని తీసుకెళ్ళి నేరుగా పోలీసులకు పోలీసులకి ఇచ్చేయాలని అనుకున్నాడు.అయితే ఆసక్తి కొద్ది ఫోన్ లో ఏం ఉన్నాయో చూద్దామని ఓపెన్ చేసిన అతనికి గట్టి షాక్ తగిలింది.

దానిలో ఉన్న కొన్ని ఫొటోలను చూసిన అతనికి ముచ్చెమటలుపట్టాయి.ఓ మహిళ, ఆమె పిల్లలు, భర్త అంతా తుపాకులు, బాంబుల మధ్య ఉన్న చిత్రాలున్నాయి.దాంతో భయపడి ఆ ఫోన్ ని నేరుగా తీసుకెళ్ళి పోలీసులకు అప్పగించాడు.అప్పుడు అసలు విషయం బయటపడింది.

ఒమామియా ఐఎస్ తీవ్రవాదని, అక్కడ ఆమెకు ఇద్దరు భర్తలున్నారని, పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది.ఆమె చాలామంది యూరోపియన్ యువతులను ఐఎస్‌లో చేర్పించిందని కూడా తేలింది.

దీంతో పోగొట్టుకున్న ఫోన్ తో జర్మనీలో ఉన్న ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.కటకటాల మధ్యకి పంపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube