ఐసిస్ ద్రుష్టి మారిందా! దక్షిణాసియా టార్గెట్ గా ఉగ్ర కుట్రలకి తెరతీస్తుందా

సిరియాలో మారణహోమం సృష్టించి లక్షల మంది ప్రాణాలు పోవడానికి కారణం అయిన ఇస్లామిక్ ఉగ్రవాదం అక్కడ్డ తన స్థానం కోల్పోయే పరిస్థితికి వచ్చేసింది.ఐఎస్ఐఎస్ వ్యవస్థాపకుడు అబూబుకర్ ని మట్టుబెట్టిన తర్వాత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ దారి తప్పినట్లు అయ్యింది.

 Isis Targeting On Asian Countries-TeluguStop.com

దీంతో సిరియాలో వారి ఆదీనంలో ఉన్న చాలా ప్రాంతాలని తిరిగి సైన్యం స్వాదీనం చేసుకుంది.ఇదిలా ఉంటే ఇండియాని టార్గెట్ గా చేసుకొని పాకిస్తాన్ కేంద్రంగా చాల ఉగ్రవాద సంస్థలు పని చేస్తున్నాయి.

వీటి ముఖ్య ఉద్దేశ్యం అంతా దక్షిణాసియా దేశాలలో ఇస్లాం స్థాపన.దానికి ప్రధాన అడ్డంకి ఇండియా.

అందుకే వారు ముందుగా భారత్ ని లక్ష్యంగా చేసుకున్నారు.

ఇప్పుడు ఈ ఉగ్రవాద సంస్థలతో జత కట్టి ఐసిస్‌ కొన్నేళ్లుగా దక్షిణాసియా దేశాలను లక్ష్యం చేస్తూ వచ్చాయి.

కేవలం పాక్, బంగ్లాదేశ్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకే అడ్డాగా మారిన నేపథ్యంలో తన ఉనికి చాటుకోవడానికి ఐసిస్‌ ప్రయత్నించింది.ఇలాంటిదే తొలి సారిగా ఢాకాలో 2016 జూలైలో జరిగిన బేకరీ ఘటన.భారత్‌లోనూ విధ్వంస కార్యక్రమాలు చేయట్టాలని ఐఎస్‌ చేసిన యత్నాలు నిఘా వర్గాల అప్రమత్తతతో సఫలీకృతం కాలేదు.మాల్దీవులలో కూడా 90 మంది ఐసిస్‌ ఉగ్రవాదుల్ని పోలీసులు అరెస్టు చేయడంతో పెనుముప్పుతప్పింది.

అయితే శ్రీలంకలో మారణహోమం సృష్టించడం ద్వారా ఐసిస్ భారత్ ని భయపెట్టే ప్రయత్నం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube