ప్రపంచాన్ని వణికించిన.. మోస్ట్ వాంటేడ్: ఐసిస్ అధినేత బాగ్ధాదీ హతం

పెద్దన్న అమెరికాతో పాటు ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన మోస్ట్ వాంటేడ్ టెర్రరిస్ట్, ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బాగ్ధాదీ హతమయ్యాడు.శనివారం సిరియాలోని వైమానిక ప్రాంతంలో అమెరికా సైన్యం నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్‌లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారని వీరిలో బాగ్ధాదీ కూడా ఉన్నాడని కథనాలు వెలువడుతున్నాయి.

 Isis Chief Baghdadi Killed By Us Army In Syria-TeluguStop.com

దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటన చేయాల్సి వుంది.అయితే ‘‘కొద్దిసేపటి క్రితమే భారీ సంఘటన’’ జరిగిదంటూ ట్రంప్ ట్వీట్ చేయడంతో ఈ ఆపరేషన్ నిజమే అయి వుండొచ్చని ప్రపంచం విశ్వసిస్తోంది.

సిరియాలో తలదాచుకున్న అబు బకర్‌ను మట్టుబెట్టేందుకు అత్యున్నత స్థాయిలో వ్యూహారచన జరిగినట్లుగా తెలుస్తోంది.దీనికి ట్రంప్ ఆమోదముద్ర వేశారని.ఆయన ఆదేశాలతోనే స్పెషల్ కమాండోలు మిషన్‌ పూర్తిచేశాయని వార్తలు వస్తున్నాయి.

Telugu Abubakr, Isis, Trump, Syria, Official-

 

గతంలో ఎన్నోసార్లు బాగ్ధాదీ చనిపోయినట్లు వార్తలు వచ్చాయి.2014 జూలైలో చివరిసారిగా వీడియో సందేశం ద్వారా కనిపించిన ఐసిస్ అధినేత ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు.కుర్దులు, ఇరాన్, రష్యా సేనలు ఇస్లామిక్ ఉగ్రవాదులను తరిమికొట్టడంతో బాగ్ధాదీ సిరియా వాయువ్య ప్రాంతంలో తలదాచుకున్నట్లుగా తెలుస్తోంది.

కాగా అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌‌ను 2011లో అమెరికా నేవీ స్పెషల్ కమాండోలు హతమార్చారు.పాకిస్థాన్‌లోని అబోట్టాబాద్‌లోని ఓ బంగ్లాలో తలదాచుకున్న లాడెన్‌ను అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశాల మేరకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి అంతం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube