సాయి ధరమ్ తేజ్ అలాంటి ఆర్టిస్ట్.. ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్?

దేవకట్టా దర్శకత్వంలో ఐశ్వర్య రాజేష్ సాయి ధరమ్ తేజ్ జంటగా నటించినటువంటి చిత్రం రిపబ్లిక్.ఈ సినిమా అక్టోబర్ 1వ తేదీ విడుదల కానుంది.

 Ishwarya Rajesh Talking About Republic Movie-TeluguStop.com

ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమా గురించి ముచ్చటించారు.ఈ సందర్భంగా ఈ బ్యూటీ మాట్లాడుతూ రిపబ్లిక్ సినిమా పూర్తి కమర్షియల్ చిత్రం కాదు.

ఈ సినిమాను నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారని తెలియజేశారు.

 Ishwarya Rajesh Talking About Republic Movie-సాయి ధరమ్ తేజ్ అలాంటి ఆర్టిస్ట్.. ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక దర్శకుడి గురించి మాట్లాడుతూ ఆయన ఒక విజన్ ఉన్న వ్యక్తి.తను అనుకున్నది అనుకున్న విధంగా తెరపై చూపించడం కోసం ఎంతో శ్రమిస్తారని ఈ సందర్భంగా వెల్లడించింది.

ఈ క్రమంలోనే చాలా తక్కువ సమయంలో నా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేశానని ఐశ్వర్య రాజేష్ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పేర్కొన్నారు.ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Telugu Fim News, Ishwarya Rajesh, Republic Movie, Sai Dharam Tej, Shocking Comments, Tollywood-Movie

సాయి ధరమ్ తేజ్ లో ఓ మంచి నటుడు దాగున్నాడని, ఆయన సినిమా కోసం ఎంతో కష్ట కష్టపడ్డారని తెలిపారు. చిన్నపిల్లలు మాదిరి స్క్రిప్ట్ రాసుకుని సంభాషణలను బాగా ప్రాక్టీస్ చేసేవారు.ఇక ఈ సినిమాలో కలెక్టర్ పాత్రలో సాయి తేజ్ నటన అద్భుతంగా ఉందని, ముఖ్యంగా కోర్టులో జరిగే సన్నివేశాలను సాయితేజ్ సింగిల్ టేక్ లో పూర్తి చేశారంటూ అతనిపై ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు.సాయి తేజ్ ప్రమాదానికి గురవడం వల్ల ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్న సంగతి మనకు తెలిసిందే.

#Sai Dharam Tej #Ishwarya Rajesh #Republic #Fim

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు