మిస్సయిన హీరోయిన్ వచ్చేసింది.. కనిపెట్టిన వారికి కృతజ్ఞతలు

యంగ్‌ హీరో తేజ సజ్జా తాజా చిత్రం ఇష్క్‌ ఈనెల 30వ తారీకున ప్రేక్షకుల ముందుకు థియేటర్ల ద్వారా విడుదల కాబోతుంది.సెకండ్‌ వేవ్‌ తర్వాత థియేటర్ల ద్వారా రాబోతున్న సినిమా మొదటిది ఇదే అవ్వడం వల్ల అందరి దృష్టిని ఈ సినిమా ఆకర్షిస్తుంది.

 Ishq Movie Hero Teja Sajja Funny Video-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి చాలా నెలలు అవుతుంది.కరోనా వల్ల ఆలస్యం అయిన ఈ సినిమాను ఎట్టకేలకు విడుదల చేయబోతున్న నేపథ్యంలో హీరో తేజ చాలా కష్టపడి ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.

కేవలం హీరో ఒక్కడే ప్రమోషన్స్‌ చేస్తున్న నేపథ్యంలో హీరోయిన్‌ ఎక్కడ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.తాజాగా తేజ స్వయంగా ఇష్క్‌ హీరోయిన్‌ మిస్సింగ్‌ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు.

 Ishq Movie Hero Teja Sajja Funny Video-మిస్సయిన హీరోయిన్ వచ్చేసింది.. కనిపెట్టిన వారికి కృతజ్ఞతలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాంతో ఇష్క్‌ సినిమా ప్రమోషన్‌ కు ఆమె రావడానికి ఇష్టం లేదా అంటూ కొందరు వ్యాఖ్యలు చేశారు.

మొత్తానికి సినిమా విడుదల కు కాస్త ముందు అయినా హీరోయిన్‌ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ప్రమోషన్ కార్యక్రమాలకు వచ్చేసింది. ఆమె ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

ఇక తేజ మరో ఫన్నీ వీడియోను విడుదల చేశారు.నిన్న నేను సోషల్‌ మీడియాలో హీరోయిన్ మిస్సింగ్‌ అంటూ చేసిన ప్రకటనకు అంతా రెస్పాన్స్ అయ్యారు.

ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.ఆమె తమకు దొరికేందుకు సహకరించిన పోలీసు వారికి ఎంబస్సీ వారికి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అంటూ తేజ ఫన్నీగా చెప్పుకొచ్చాడు.ఈ సినిమా లో వీరిద్దరి మద్య కెమిస్ట్రీ చాలా బాగుంటుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు.బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి ఇప్పుడు స్టార్‌ గా వరుసగా సినిమాలు చేస్తున్న తేజకు ఈ సినిమా సక్సెస్ ను తెచ్చి పెట్టడం ఖాయంగా నమ్మకం వ్యక్తం అవుతోంది.

#Ishq #Teja Sajja #PriyaPrakash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు