మళ్లీ వస్తానంటున్న ముద్దుగుమ్మ, ఛాన్స్‌లు దక్కేనా?  

Isha Chawla, Tollywood re entry, Isha Chawla Tollywood, Movie Offers - Telugu Isha Chawla, Isha Chawla Tollywood, Movie Offers, Tollywood Re Entry

తెలుగు ప్రేక్షకులకు ఇషా చావ్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఆది సాయి కుమార్‌ హీరోగా తెరకెక్కిన ప్రేమ కావాలి చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ అమ్మడు చూడ్డానికి ముద్దుగా క్యూట్‌గా ఉన్నా కూడా ఆఫర్లు మాత్రం పెద్దగా దక్కలేదు.

 Isha Chawla Tollywood Re Entry

తీవ్రంగా ప్రయత్నాలు చేసి గ్లామర్‌ ప్రదర్శణకు సిద్దం అయినా కూడా ఈమెను పట్టించుకునే వాళ్లు కరువయ్యారు.దాంతో కొంత కాలానికే ఈమె కనుమరుగయ్యింది.

ఇలా ఎంతో మంది హీరోయిన్స్‌ కనుమరుగయ్యి బాలీవుడ్‌ కోలీవుడ్‌ లేదా మరో వుడ్‌లో తేలుతూ ఉంటారు.కాని ఇషా చావ్లా మాత్రం మళ్లీ టాలీవుడ్‌లోనే తేలాలని ప్రయత్నాలు చేస్తోంది.

మళ్లీ వస్తానంటున్న ముద్దుగుమ్మ, ఛాన్స్‌లు దక్కేనా-Movie-Telugu Tollywood Photo Image

ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుందట.

ఇటీవల కాలంలో ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా పోస్ట్‌లు పెట్టడంతో పాటు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ తాను సినిమాల్లో నటించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ప్రకటించింది.

ఈమె చేస్తున్న ప్రకటనలు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి.ఒక సారి వచ్చి వెళ్లిన హీరోయిన్‌కు మళ్లీ ఛాన్స్‌లు అంటే చాలా చాలా కష్టం.ఒక వేళ ఏదో ఒకటి వచ్చినా కూడా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో స్టార్‌డంను దక్కించుకోవడం మరింత కష్టంగా చెబుతున్నారు.అలాంటిది ఇషా చావ్లా తెలుగులో రీ ఎంట్రీ ఇస్తానంటూ చాలా నమ్మకంగా చెప్పడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది.

మరి ఈ అమ్మడి నమ్మకం ఎంత వరకు నిజం అయ్యేనో చూడాలి.

#Isha Chawla

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Isha Chawla Tollywood Re Entry Related Telugu News,Photos/Pics,Images..