తన ఎఫైర్లు గురించి చెబుతున్న టాలీవుడ్ హీరోయిన్  

Isha Chawla Open Her Love Affairs - Telugu Celebrity Lifestyle, Heroines,, South Cinema, Telugu Cinema, Tollywood

సినిమా ఇండస్ట్రీలో అందాల భామలకి లవ్ ఎఫైర్లు అనేవి సర్వ సాధారణం.అయితే వాటిని అందాల భామలు అంత వేగంగా ఒప్పుకోరు.

 Isha Chawla Open Her Love Affairs

మీడియా వారి లవ్ స్టోరీస్ గురించి ప్రచారం చేసిన అలాంటివి ఏమీ లేవని తేల్చేస్తారు.తాము మంచి స్నేహితులం అంటూ కబుర్లు చెబుతారు.

అయితే ఇలాంటి లవ్ ఎఫైర్స్ గురించి ఒప్పుకుంటే తరువాత హీరోయిన్ అవకాశాలు తగ్గిపోతాయని భయంతోనే అందాల భామలు వాటిని దాస్తూ ఉంటారు.అయితే పబ్లిక్ గానే తాము ప్రేమించిన వ్యక్తులతో పార్టీలకి వెళ్తూ మీడియాకి చిక్కుతూ ఉంటారు.

తన ఎఫైర్లు గురించి చెబుతున్న టాలీవుడ్ హీరోయిన్-Movie-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయంలో ప్రేమ కావాలి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయినా ఇషాచావ్లా కాస్తా డిఫరెంట్ అని నిరూపించుకుంది.

మొదటి సినిమాతోనే హిట్ కొట్టి తరువాత సునీల్ కి హీరోయిన్ గా పూలరంగడుతో మరో హిట్ ని తన ఖాతాలోవేసుకున్న ఈ అమ్మడు బాలక్రిష్ణకి జోడీగా శ్రీమన్నారాయణ అనే సినిమాలో కూడా నటించింది.

అయితే ఈ భామకి లక్కు కలిసి రాకపోవడం వలన స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.ఈ అమ్మడు కెరియర్ లో సునీల్ తో ఏకంగా మూడు సినిమాలు చేసింది.

అయితే ఈ భామ లుక్ పరంగా కుర్ర హీరోలని డామినేట్ చేసేస్తుంది.దీంతో ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది.

తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ తాను ఇద్దరితో రిలేషన్ షిప్ కొనసాగించా అని చెప్పింది.

మొదటి రిలేషన్ షిప్ అయితే కొన్నేళ్ల పాటు సాగిందని, రెండవది మాత్రం చిన్నదని చెప్పుకుంది.

ఇపుడు మాత్రం తనకు ఎటువంటి అఫైర్లు లేనే లేవని క్లారిటీ ఇచ్చింది.మొత్తానికి ఈ అమ్మడు తనకున్న లవ్ ఎఫైర్స్ గురించి బాహాటంగా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test