ఈషా అంబానీ పెళ్లికి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా.. గుండె పట్టుకుని ఇది చదవండి

ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే టాప్‌ ధనవంతుల జాబితాలో ముఖేష్‌ అంబాని ఒకరు.ఇండియాలో గత కొన్నాళ్లుగా టాప్‌ ధనవంతుడిగా కొనసాగుతూ వస్తున్న ముఖేష్‌ అంబాని తన కూతురు వివాహంను ఇప్పటి వరకు ఇండియాలో ఎవరు నిర్వహించనంత భారీగా నిర్వహిస్తున్నాడు.

 Isha Ambani Anand Piramal Wedding Cost-TeluguStop.com

పెళ్లికి ముందు ఆరు నెలల నుండి ఏర్పాట్లు జరిగాయి.పది రోజులు ఉండగా సందడి మొదలైంది.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ కోటలో ఈ వివాహం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.డిసెంబర్‌ 12న ఈషా అంబాని, ఆనంద్‌ పిరమిల్‌ల వివాహం వైభవంగా జరుగబోతుంది.

ఇటీవలే ప్రీ వెడ్డింగ్‌ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు.అందుకోసం బాలీవుడ్‌ సెలబ్రెటీలు మరియు ప్రముఖులు హాజరు అయ్యారు.అమెరికా నుండి కూడా పెద్ద ఎత్తున బిజినెస్‌ మన్స్‌ మరియు ప్రముఖుల హాజరు అయ్యారు.ఈ పెళ్లి ఖర్చు మరియు వచ్చిన వారి సెక్యూరిటీ వసతి ఇలా అన్ని విషయాకు కలిపి అంబానీ ఫ్యామిలీ ఏకంగా 5 వేల కోట్లను ఖర్చు చేస్తున్నట్లుగా ఖర్చు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగోతంది.

లక్షల కోట్ల ఆస్తులు ఉన్న వ్యక్తి 5 వేల కోట్లను ఖర్చు చేసి కూతురు పెళ్లి చేయడం పెద్ద విశేషం ఏమీ లేదు.పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడంతో పాటు హుందాతనం చూపించడానికి అంబానీ ఫ్యామిలీ ప్రత్యేక శ్రద్దను చూపుతున్నారు.హాలీవుడ్‌ ప్రముఖ పాప్‌ సింగర్స్‌తో పాటు, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సెలబ్రెటీలను పెళ్లిలో చూపించి తమ స్టేటస్‌ను చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

ముఖేష్‌ అంబానీ, నీతాలకు ముగ్గురు పిల్లలు.ముగ్గురిలో ఒకే ఒక్క కూతురు.ఆమె ఈషా అంబానీ.

అందుకే ఆమె పెళ్లిని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

ఈనెల 12వ తారీకున పెళ్లితో ఈషా, ఆనంద్‌లు ఒక్కటి కాబోతున్నారు.

ఇండియాలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా ఈ పెళ్లిని రికార్డులోకి ఎక్కించే ఉద్దేశ్యంతో అంబానీ ఫ్యామిలీ ఈ స్థాయి ఏర్పాట్లు చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే కొందరు మాత్రం అయిదు వేల కోట్లు కాదు పది వేల కోట్లు కూడా ఖర్చు చేసి ఉంటారు అంటూ ప్రచారం చేస్తున్నారు.పెళ్లి విషయమై త్వరలోనే మరిన్ని వార్తలు త్వరలో వస్తాయని ఆశిద్దాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube