వైసీపీ నేతలే జగన్‌ని ప్రజలకు దూరం చేస్తున్నారా..?

రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సహజంగానే జరుగుతుంటుంది.ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటారు.

 Is Ysrcp Leaders Only Creating Distance Between Jagan And Peoples, Andhra Prades-TeluguStop.com

అలాగే ప్రతిపక్ష నేతలు.అధికార పార్టీపై ఏదొరకంగా విమర్శలు చేస్తుంటారు.

ఇక ప్రతిపక్షాలు చేసే విమర్శలకు అధికార పార్టీ నుంచి కౌంటర్లు కూడా వస్తాయి.అయితే ఇక్కడ ఎవరి ఆరోపణలు, విమర్శల్లో పస ఉంటుందో వారికే ప్రజల మద్ధతు ఉంటుంది.

కానీ అలా కాకుండా విమర్శలు హద్దులు దాటిస్తే అసహ్యించుకునే పరిస్థితి ఉంటుంది.ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఇలాగే ఉన్నాయి.

అటు అధికార, ఇటు ప్రతిపక్షాల విమర్శలని ప్రజలు ఏ మాత్రం హర్షించడం లేదు.ముఖ్యంగా అధికారంలో ఉండేవారు ఎక్కువ బాధ్యతతో ఉండాల్సి ఉంది.

ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ఓర్పుతో కౌంటర్లు ఇవ్వాల్సి ఉంటుంది.ఏపీలో అధికార పార్టీ నేతలు మాత్రం అలా చేయడం లేదు.

పూర్తిగా టెంపర్ అయిపోతూ, బూతులు అందుకుంటున్నారు. వైసీపీ నేతలు ఎక్కువగా విమర్శల కంటే బూతులు మాట్లాడటానికే ఇష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.

దీని వల్ల పార్టీకే ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశముందని తెలుస్తోంది.గత కొంతకాలంగా మంత్రులతో సహ పలువురు నేతలు విమర్శల్లో బూతులే ఎక్కువ మాట్లాడుతున్నారు.

మరీ ముఖ్యంగా అమరావతి రైతులని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు. ఇలా దూషించడాన్ని రాష్ట్రంలో ఇతర ప్రాంతాల వారు ఏ మాత్రం అంగీకరించడం లేదనే తెలుస్తోంది.

మామూలుగా అమరావతి కోసం ఏం చేస్తాం, లేదా టీడీపీ నేతలకు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేయాలి గానీ, అలా కాకుండా అమరావతి రైతులని కించపరిచేలా మాట్లాడటం వల్ల జగన్‌కే మైనస్ అవుతుందని తెలుస్తోంది.అక్కడ ఉన్నది రైతులే, వారు తమ భవిష్యత్ కోసం పోరాటం చేస్తున్నారు.

ఒకవేళ వైసీపీ నేతలు చెప్పినట్లు ఎంత పెయిడ్ ఆర్టిస్టులు అయినా సరే పోలీసులు చేతుల్లో దెబ్బలు తినడానికి, ఇన్ని రోజులు ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండరు.కాబట్టి అమరావతిలో ఉన్నది నిజమైన రైతులని గుర్తించి, వైసీపీ నేతలు ఇకనైనా బూతులు మాట్లాడటం మానిస్తే బెటర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube